Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమాలో ఈమె లేదు

మహేష్ బాబు, పరశురామ్ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతలోనే ఈ సినిమాలో హీరోయిన్ అంటూ తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటివరకు కియరా అద్వానీ, కీర్తిసురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించగా.. తాజాగా ఎవరూ ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరు ప్రియా వారియర్. వింక్ సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మాయి, మహేష్ కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందనే వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి ఈ పుకారు విని యూనిట్ కూడా […]

మహేష్ సినిమాలో ఈమె లేదు
X

మహేష్ బాబు, పరశురామ్ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతలోనే ఈ సినిమాలో హీరోయిన్ అంటూ తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొన్నటివరకు కియరా అద్వానీ, కీర్తిసురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించగా.. తాజాగా ఎవరూ ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరు ప్రియా వారియర్. వింక్ సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మాయి, మహేష్ కొత్త సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందనే వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి ఈ పుకారు విని యూనిట్ కూడా ఆశ్చర్యపోయింది.

నిజానికి మహేష్ కోసం ఇప్పటివరకు ఎవ్వర్నీ సంప్రదించలేదంటున్నాడు దర్శకుడు పరశురామ్. లాక్ డౌన్ వల్ల హీరోయిన్ల కాల్షీట్లన్నీ తలకిందులయ్యాయని, ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలతో పాటు అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలకు కాల్షీట్లు కేటాయించి.. అప్పటికీ కాస్త ఫ్రీగా ఉండే హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ప్రియా వారియర్ పేరును అస్సలు పరిశీలించలేదని స్పష్టంచేశాడు.

మహేష్ తో తను సినిమా చేయబోతున్నట్టు ఈమధ్యే ప్రకటించాడు పరశురామ్. స్క్రీన్ ప్లే లాక్ అవ్వడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మహేష్ తో నిర్మాతలతో చర్చించి హీరోయిన్ పై నిర్ణయం తీసుకుంటామంటున్నాడు ఈ డైరక్టర్.

First Published:  2 May 2020 8:00 AM GMT
Next Story