Telugu Global
NEWS

ఏపీ లిక్కర్ లైన్‌... అంచనా తప్పిందా?

దేశంలోని వివిధ రాష్ట్రాలు మద్యం విక్రయాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో సహజంగానే మద్యం తాగే వారు షాపుల వద్దకు ఒక్కసారిగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. దీనిపై చంద్రబాబునాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల వల్ల రద్దీ చూసి షాక్‌కు గురయ్యానని… ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు అనడానికి ఇదే నిదర్శనమని దేశంలోని […]

ఏపీ లిక్కర్ లైన్‌... అంచనా తప్పిందా?
X

దేశంలోని వివిధ రాష్ట్రాలు మద్యం విక్రయాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో సహజంగానే మద్యం తాగే వారు షాపుల వద్దకు ఒక్కసారిగా వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. దీనిపై చంద్రబాబునాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల వల్ల రద్దీ చూసి షాక్‌కు గురయ్యానని… ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు అనడానికి ఇదే నిదర్శనమని దేశంలోని చాలా మందికి అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు.

ఏపీలో ఇంత పెద్ద క్యూలైన్‌లు కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత షాపులు తీయడం ఒక కారణం. మరో ముఖ్యమైన కారణం జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం దిశగా మద్యం షాపుల సంఖ్యను భారీగా తగ్గించారు. చంద్రబాబు హయాంలో 4వేల 380 మద్యం షాపులు రాష్ట్రంలో ఉండేవి. వాటిని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి 20 శాతం చొప్పున తగ్గిస్తామంటూ తొలి ఏడాది 3,500 షాపులకు పరిమితం చేసింది. దాంతో షాపుల సంఖ్య తగ్గిపోయింది.

అదే సమయంలో చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో 50వేలకు పైగా బెల్ట్ షాపులు ఉండేవి. ఈ బెల్ట్‌ షాపుల వల్ల ప్రతి పల్లెలోనూ నిరంతరం మందు ఏరులై పారేది. వీధికో బెల్ట్ షాపు ఉండేది. అందువల్ల మద్యం తాగే వారు తమ సమీపంలోని బెల్ట్ షాపుల వద్ద తాగేవారు.

కానీ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత బెల్ట్‌ షాపులను పూర్తిగా ఎత్తివేశారు. పైగా మద్యం షాపులను ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకుంది. దాంతో రాష్ట్రంలో మద్యం కేవలం 3,500 మద్యం షాపుల వద్ద మాత్రమే దొరుకుతోంది. బెల్ట్‌ షాపులు లేవు, భారీగా షాపులు లేవు. అందుకే ఇప్పుడు ఒక్కసారిగా ఈ 3వేల 500 షాపుల మీద ఒత్తిడి పడింది.

తొలి రోజు కాబట్టి సహజంగానే అందరూ ఒకేసారి వచ్చారు. ఒకటి రెండు రోజులు గడిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అంచనా వేయవచ్చు. ఒకవేళ నిత్యం ఇలాంటి క్యూలైన్లే ఉంటే మాత్రం ప్రభుత్వం మద్యం విక్రయాలపై వెనక్కు తగ్గాల్సిందే.

First Published:  4 May 2020 6:48 AM GMT
Next Story