Telugu Global
NEWS

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్..?

కేసులు పెరుగుతుండటంతో సర్కార్ నిర్ణయం మద్యం దుకాణాలు, ప్రజారవాణా అనుమతించాలా వద్దా..! నేడు మరోసారి సమీక్ష తెలంగాణలో కోవిడ్-19కేసులు పెరిగిపోతుండటంతో పాటు, ఇప్పటికే గుర్తించిన కంటైన్మెంట్ జోన్ల క్వారంటైన్ గడువు ఇంకా ముగియక పోవడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సుదీర్ఘ సమావేశంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 21 వరకు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రెండో దశ లాక్‌డౌన్ మే 7 […]

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్..?
X
  • కేసులు పెరుగుతుండటంతో సర్కార్ నిర్ణయం
  • మద్యం దుకాణాలు, ప్రజారవాణా అనుమతించాలా వద్దా..!
  • నేడు మరోసారి సమీక్ష

తెలంగాణలో కోవిడ్-19కేసులు పెరిగిపోతుండటంతో పాటు, ఇప్పటికే గుర్తించిన కంటైన్మెంట్ జోన్ల క్వారంటైన్ గడువు ఇంకా ముగియక పోవడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సుదీర్ఘ సమావేశంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 21 వరకు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం రెండో దశ లాక్‌డౌన్ మే 7 వరకు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్‌డౌన్ నేటి నుంచి మే 17 వరకు పొడిగించింది. కాని కేంద్రం జోన్ల వారీగా పలు సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే గతంలో కూడా తెలంగాణలో కేంద్ర మార్గదర్శకాలు అమలు కాలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగిస్తే మార్గదర్శకాలు అమలు చేయాలా లేదా అనే విషయంపై కూడా చర్చ సాగింది.

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకోవడంపై ఈ భేటీలో చర్చకు వచ్చింది. మొదట అందరినీ పంపేయమని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చి చిక్కుకున్న వారిని మాత్రమే స్వస్థలాలకు అనుమతించాలని కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేయడం ఇబ్బందిగా మారింది.

ఇప్పటికే హైదరాబాద్, రామగుండం వంటి ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమను వెంటనే సొంతూర్లకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొత్త మార్గదర్శకాల వల్ల తలెత్తే పరిణామాలపై సమావేశంలో చర్చించారు.

ఇక గత 40 రోజులుగా మూత పడిన మద్యం దుకాణాలు, స్తంభించిన ప్రజారవాణాపై కూలంకషంగా చర్చించారు. కేంద్రం ఆదేశాల మేరకు పరిమిత ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించడం, గ్రీన్ జోన్లలో ప్రజారవాణాను పునరుద్దరించడంపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. కరోనా కేసులు రాష్ట్రంలో తిరిగి పెరగడంపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.

మే 21 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తే ఏయే రంగాలకు సడలింపులు ఇవ్వాలి, కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలా వద్దా అనే విషయాలు రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో కేబినెట్ ఎజెండా రూపొందించడానికి సోమవారం మరోసారి సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రజల అభిప్రాయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా సేకరించాలని సీఎం సూచింరారు. చాలా మంది లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ భేటీలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, శాంత కుమారి, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణారావు పాల్గొన్నారు.

First Published:  3 May 2020 8:34 PM GMT
Next Story