పాకిస్థాన్ క్రికెటర్ తో తమన్న….

హఠాత్తుగా పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్న కలిసున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో సాగుతుందంటూ ఆ వెంటనే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. భారత్ కు చెందిన సానియా మీర్జా పాక్ క్రికెటర్ ను పెళ్లాడిందని, కాబట్టి మతం వేరైనా తమన్న కూడా పాక్ క్రికెటర్ ను పెళ్లాడితే ఇబ్బందేం ఉండదని అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా మొదలైంది.

ఊహించని విధంగా తమన్నకు సంబంధించి స్టిల్ బయటకు రావడంతో ఆమె పీఆర్ యూనిట్ వెంటనే క్లారిటీ ఇచ్చింది. ఆ స్టిల్ లో ఉన్నది తమన్న, రజాక్ అనే విషయాన్ని అంగీకరించిన తమన్న యూనిట్ సభ్యులు.. అది చాలా పాత ఫొటో అని.. దుబాయ్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు తమన్న వెళ్లినప్పుడు.. అదే ఓపెనింగ్ కు రజాక్ కూడా రావడంతో ఇద్దరూ కలిసి ఫొటో దిగారని స్పష్టంచేశారు.

అంతకుమించి తమన్న-రజాక్ మధ్య ఏమీ లేదని ఆమె టీమ్ నుంచి క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థతో తమన్న మాట్లాడింది. ప్రస్తుతం తను సింగిల్ గా ఉన్నానని, ఎవ్వరితో ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ప్రకటించింది. పెళ్లికి కూడా ఇంకా చాలా టైమ్ ఉందని స్పష్టం చేసింది. అంతలోనే రజాక్ తో ఎఫైర్ అంటూ పుకారు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.