Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ మనసులో మాట ఇది

లాక్ డౌన్ తో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఒకరితో చేయాల్సిన సినిమా మరొకరికి వెళ్లిపోతోంది. ఆల్రెడీ అనుకున్న సినిమా సెట్స్ పైకి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే పరిస్థితి లేదంటూ కథనాలు వస్తున్నాయి. లాక్ డౌన్ తో ఆర్ఆర్ఆర్ ఆలస్యమౌతోంది. అది మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలీదు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఎప్పటికి […]

త్రివిక్రమ్ మనసులో మాట ఇది
X

లాక్ డౌన్ తో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఒకరితో చేయాల్సిన సినిమా మరొకరికి వెళ్లిపోతోంది. ఆల్రెడీ అనుకున్న సినిమా సెట్స్ పైకి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే పరిస్థితి లేదంటూ కథనాలు వస్తున్నాయి.

లాక్ డౌన్ తో ఆర్ఆర్ఆర్ ఆలస్యమౌతోంది. అది మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలీదు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఎప్పటికి కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు. దీని వల్ల త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆలస్యమౌతోంది. దీంతో ఎన్టీఆర్ తో సినిమా కంటే ముందు త్రివిక్రమ్ మరో యంగ్ హీరోతో కలిసి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ ప్రచారం నడుస్తోంది.

అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఎంత లేట్ అయినా తారక్ కోసం వెయిట్ చేయడానికి త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదంతా ఖాళీగా ఉండడానికే త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురములో లాంటి పెద్ద హిట్ తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలనేది త్రివిక్రమ్ మనసులో మాట.

First Published:  5 May 2020 7:15 AM GMT
Next Story