Telugu Global
Cinema & Entertainment

దేవరకొండ బర్త్ డే స్పెషల్ ఉంటుందా?

హీరోల పుట్టినరోజులకు సినిమా విశేషాలు మోసుకురావడం ఆనవాయితీ. ఈ విషయంలో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు. హీరోలంతా తమ పుట్టినరోజు నాడు కొత్త సినిమా సంగతుల్ని మోసుకొస్తుంటారు. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో విజయ్ దేవరకొండ పుట్టినరోజు రాబోతోంది. దీని కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున కొత్త సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని అందరి ఆశ. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ […]

దేవరకొండ బర్త్ డే స్పెషల్ ఉంటుందా?
X

హీరోల పుట్టినరోజులకు సినిమా విశేషాలు మోసుకురావడం ఆనవాయితీ. ఈ విషయంలో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు. హీరోలంతా తమ పుట్టినరోజు నాడు కొత్త సినిమా సంగతుల్ని మోసుకొస్తుంటారు. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో విజయ్ దేవరకొండ పుట్టినరోజు రాబోతోంది. దీని కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున కొత్త సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని అందరి ఆశ.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీనికి లైగర్ అనే టైటిల్ పెట్టారు. ఆ పేరును అధికారికంగా యూనిట్ ప్రకటించలేదు. కానీ ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది. దీంతో లైగర్ కే అంతా ఫిక్స్ అయిపోయారు.

అయితే యూనిట్ మాత్రం ఈ సినిమా ఫైటర్ అనే సంభోదిస్తోంది. బాలీవుడ్ మీడియా కూడా అదే పేరు చెబుతోంది. మరోవైపు యూనిట్ కూడా టైటిల్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ బర్త్ డే (9న) వస్తోంది. కనీసం ఆరోజైనా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇటు దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రం తన సినిమా గురించి మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడడం లేదు. కనీసం 9వ తేదీకైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

First Published:  5 May 2020 10:13 AM GMT
Next Story