Telugu Global
International

నెలాఖరులో వాట్సాప్‌ పే లాంచ్‌

వాట్సాప్‌ పే యాప్‌ ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ మేసేజ్‌ యాప్‌గా ఉంది. ఇప్పటి నుంచి పే సర్వీసు కూడా అందిస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. ఈ నెలాఖరులో లాంచ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో ఇప్పటికే వాట్సాప్‌ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐతో కూడా ఓ ఎంవోయు కుదర్చుకోబోతోంది. ఈ నాలుగు బ్యాంకులతో కలిసి పేమెంట్‌ సర్వీసులు అందించబోతుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు […]

నెలాఖరులో వాట్సాప్‌ పే లాంచ్‌
X

వాట్సాప్‌ పే యాప్‌ ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ మేసేజ్‌ యాప్‌గా ఉంది. ఇప్పటి నుంచి పే సర్వీసు కూడా అందిస్తోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. ఈ నెలాఖరులో లాంచ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో ఇప్పటికే వాట్సాప్‌ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐతో కూడా ఓ ఎంవోయు కుదర్చుకోబోతోంది. ఈ నాలుగు బ్యాంకులతో కలిసి పేమెంట్‌ సర్వీసులు అందించబోతుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ నడుస్తున్నాయి. నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో లావాదేవీలు జరగనున్నాయి.

లావాదేవీలు ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. భారీ డిజిటల్‌ ప్లాట్‌పామ్స్‌లో సేవలందించే యాప్‌లు…ఖచ్చితంగా ఒకటికి మించి బ్యాంకులతో అనుసంధానం కావాలని సూచించింది. ఇటీవల ఫోన్‌ పే, స్విగ్గీ యస్‌బ్యాంక్‌తో మాత్రమే లావాదేవీలు జరిపాయి. దీంతో ఈ బ్యాంకు కస్టమర్లకు సమస్యలు వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆదేశాలు జారీ చేసింది.

వాట్సాప్‌కు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వాట్సాప్‌ పే సర్వీసు రాకతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎంకు గట్టి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి.

జియోలో ఇప్పటికే ఫేస్‌బుక్ పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ జియో సపోర్ట్‌తో వాట్సాప్ పే చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. డేటా లోకలైజేషన్ (డేటాను దేశీయంగానే స్టోర్ చేయాలి) నిబంధనలు వాట్సాప్ పాటించడం లేదని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో దేశీయంగా డేటా స్టోర్‌ చేస్తామని కోర్టుకు వాట్సాప్‌ తెలిపింది.

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కూడా రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన జియో మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జియో మార్ట్… ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. స్థానిక విక్రేతలు, చిన్న కిరాణ దుకాణాలు ఆన్‌లైన్‌లోకి రానున్నాయి.

First Published:  5 May 2020 5:30 AM GMT
Next Story