Telugu Global
NEWS

గ్యాస్ లీక్‌పై వదంతులు నమ్మకండి " ఏపీ పోలీసులు

విశాఖపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఇవాళ తెల్లవారుజామున గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం చాన్నాళ్లకు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, అదే పరిశ్రమలో రెండో సారి గ్యాస్ లీకైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను ఏపీ పోలీసులు కొట్టిపారేశారు. రెండో సారి గ్యాస్ లీకైందని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని.. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, భయాందోళనకు గురి కావొద్దని ఏపీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. […]

గ్యాస్ లీక్‌పై వదంతులు నమ్మకండి  ఏపీ పోలీసులు
X

విశాఖపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఇవాళ తెల్లవారుజామున గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం చాన్నాళ్లకు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, అదే పరిశ్రమలో రెండో సారి గ్యాస్ లీకైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను ఏపీ పోలీసులు కొట్టిపారేశారు.

రెండో సారి గ్యాస్ లీకైందని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని.. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, భయాందోళనకు గురి కావొద్దని ఏపీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పటికే పరిశ్రమలో మెయింటెనెన్స్ టీం మరమ్మతులు చేస్తోందని.. కొంత ఆవిరిని బయటకు పంపారని.. దాన్ని చూసి గ్యాస్ అనుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన ఎల్జీ పాలిమర్స్ సంస్థను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంపెనీలో గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోనికి వచ్చిందని చెప్పారు. ఆర్ఆర్ వెంకటాపురం, బీసీ కాలనీల్లోని ప్రజలను సమీపంలోని శిబిరాలకు తరలించామని.. వాళ్లందరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు.

ఎల్జీ పాలిమర్స్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తప్ప ఇతర ప్రాంతాల్లోని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

First Published:  7 May 2020 3:34 AM GMT
Next Story