Telugu Global
Cinema & Entertainment

ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్

పరిశ్రమలో ఎన్నో పుకార్లు వస్తుంటాయి. అందులో దాదాపు 80శాతం పుకార్లుగానే మిగిలిపోతాయి. ఓ 20 శాతం మాత్రం వాస్తవరూపం దాలుస్తాయి. అలా ఓ పుకారు వాస్తవరూపం దాల్చింది. స్వయంగా నిర్మాత అశ్వనీదత్, ఆ రూమర్ పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా రాబోతోందనేది ఆ పుకారు. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతున్నాడనే ప్రచారం కూడా నడిచింది. ఇన్నాళ్లు రూమర్ అనుకున్న ఈ వార్తను నిజం […]

ఆ పుకారుపై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్
X

పరిశ్రమలో ఎన్నో పుకార్లు వస్తుంటాయి. అందులో దాదాపు 80శాతం పుకార్లుగానే మిగిలిపోతాయి. ఓ 20 శాతం మాత్రం వాస్తవరూపం దాలుస్తాయి. అలా ఓ పుకారు వాస్తవరూపం దాల్చింది. స్వయంగా నిర్మాత అశ్వనీదత్, ఆ రూమర్ పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా రాబోతోందనేది ఆ పుకారు. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతున్నాడనే ప్రచారం కూడా నడిచింది. ఇన్నాళ్లు రూమర్ అనుకున్న ఈ వార్తను నిజం చేశాడు దర్శకుడు అశ్వనీదత్. త్వరలోనే దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు. అయితే అది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కాదు. అశ్వనీదత్ కు చెందిన స్వప్న సినిమాస్ బ్యానర్ పై రాబోతోంది.

మహానటి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు దుల్కర్. అందులో జెమినీ గణేశన్ పాత్రలో సావిత్రి భర్తగా చక్కగా నటించాడు. ఇప్పుడు మరో తెలుగు సినిమాతో పలకరించబోతున్నాడు. అతడు హీరోగా నటించిన ‘కనులు కనులు దోచాయంటే’ అనే డబ్బింగ్ సినిమా రీసెంట్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

First Published:  7 May 2020 10:06 AM GMT
Next Story