Telugu Global
National

కోటి ఏం సరిపోతుంది?, 40 ఏళ్ల అనుభవం ఉంది... ఆ గ్యాస్‌ ఏంటో నాకే తెలియదు... ఐఏఎస్‌లకు తెలుస్తుందా?

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించాడు. కోటి రూపాయలు ఇచ్చామంటున్నారు… కోటి రూపాయల సాయం సరిపోతుందా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించాడు. చనిపోయిన వారి ప్రాణాలు కోటి రూపాయలతో తిరిగి తీసుకురాగలరా అని నిలదీశాడు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించి తీరాలి. ఇది మానవ తప్పిదమా, సాంకేతిక […]

కోటి ఏం సరిపోతుంది?, 40 ఏళ్ల అనుభవం ఉంది... ఆ గ్యాస్‌ ఏంటో నాకే తెలియదు... ఐఏఎస్‌లకు తెలుస్తుందా?
X

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించాడు.

కోటి రూపాయలు ఇచ్చామంటున్నారు… కోటి రూపాయల సాయం సరిపోతుందా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించాడు. చనిపోయిన వారి ప్రాణాలు కోటి రూపాయలతో తిరిగి తీసుకురాగలరా అని నిలదీశాడు.

ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించి తీరాలి. ఇది మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా అన్నది తేల్చాలని డిమాండ్ చేశాడు. విశాఖకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరానని చెప్పాడు. మరోసారి గ్యాస్ లీక్‌ అవుతుంది… పేలుతుంది అన్న వార్తలు రాత్రి విశాఖ మొత్తం వ్యాపించాయని చంద్రబాబు చెప్పాడు. తనకు కూడా రాత్రంతా సరిగా నిద్రకూడా పట్టలేదని చంద్రబాబు చెప్పాడు.

ఈ ఘటనలో ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉందని… ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకునేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలున్నాయని విమర్శించాడు చంద్రబాబు. తూతూమంత్రంగా దర్యాప్తు చేస్తే సహించబోమని… కంపెనీ యాజమాన్యంపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశాడు.

అయితే గ్యాస్ ఘటనపై ఐఏఎస్ లతో కమిటీ వేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనకే అక్కడ లీక్ అయిన గ్యాస్ గురించి తెలియదని… అలాంటి ఐఏఎస్ లకు ఆ గ్యాస్ గురించి ఏం తెలుస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.

First Published:  8 May 2020 6:39 AM GMT
Next Story