Telugu Global
National

బాబు వైజాగ్‌కు పోనట్టే...

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విశాఖ పట్నం వెళ్లడం అనుమానంగానే ఉంది. జరుగుతున్న పరిణామాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే నింద కేంద్రంపై వేసి చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండేలా ఉన్నారు. తాను విశాఖ వెళ్లాలనుకుంటున్నానని… ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంవోను చంద్రబాబు కోరారు. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి స్పందన లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా జూమ్‌ యాప్‌లో ధృవీకరించారు. విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరానని… కానీ అనుమతి రాలేదని… […]

బాబు వైజాగ్‌కు పోనట్టే...
X

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విశాఖ పట్నం వెళ్లడం అనుమానంగానే ఉంది. జరుగుతున్న పరిణామాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే నింద కేంద్రంపై వేసి చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండేలా ఉన్నారు. తాను విశాఖ వెళ్లాలనుకుంటున్నానని… ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పీఎంవోను చంద్రబాబు కోరారు.

కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి స్పందన లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా జూమ్‌ యాప్‌లో ధృవీకరించారు. విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరానని… కానీ అనుమతి రాలేదని… వస్తే అప్పుడు విశాఖ వెళ్తానని చెప్పారు.

అంటే కేంద్రం నుంచి అనుమతి రాకుంటే చంద్రబాబు విశాఖ వెళ్లరన్న మాట. ఈ వైఖరిపైనే పలు విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే… కేంద్రం అనుమతి ఇంత ఆలస్యం అవుతున్నా… ఇంకా ఎదురుచూడకుండా రోడ్డు మార్గం ద్వారానైనా వెళ్లే వారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత మనుషులు విశాఖలో ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ఇలాగే కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని హైదరాబాద్‌లో ఇంట్లో కూర్చునే వారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అసలు ఒకసారి ఏపీలో అడుగు పెట్టి…. తిరిగి హైదరాబాద్‌ వస్తే విమర్శలు వస్తాయని అందుకే అసలు ఏపీలో అడుగే పెట్టకుండా ఉండడం బెటర్ అన్న ధోరణితో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా ఏపీకి రాలేకపోతున్నానని చెప్పిన చంద్రబాబు ఒకసారి విశాఖకు వస్తే… అక్కడి నుంచి హైదరాబాద్ కాకుండా కరకట్టపై ఉన్న సొంతింటికి ఎందుకు వెళ్లలేదన్న విమర్శలు వస్తాయి.

అలా అని కరకట్ట భవనానికి వెళ్తే కార్యకర్తలను కలవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో అది అంత సేఫ్ కాదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు హైదరాబాద్‌ విడిచి రావడం లేదని… నెపం మాత్రం కేంద్రంపై నెడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

First Published:  8 May 2020 6:34 AM GMT
Next Story