Telugu Global
National

ఏపీకి కేంద్ర బృందం కితాబు

కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం విజయవాడకు వచ్చింది. ఏపీలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించింది. ఏపీ వైద్యారోగ్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి … కేంద్ర బృందానికి పరిస్థితిని వివరించారు. వివరాలను తెలుసుకున్న కేంద్ర బృందం ఏపీ ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని కితాబిచ్చింది. కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వం అనేక యాప్‌లను వాడడం పట్ల కేంద్ర బృందం ఆసక్తి కనబరిచింది. […]

ఏపీకి కేంద్ర బృందం కితాబు
X

కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది. క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం విజయవాడకు వచ్చింది. ఏపీలో తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించింది. ఏపీ వైద్యారోగ్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి … కేంద్ర బృందానికి పరిస్థితిని వివరించారు.

వివరాలను తెలుసుకున్న కేంద్ర బృందం ఏపీ ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని కితాబిచ్చింది. కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వం అనేక యాప్‌లను వాడడం పట్ల కేంద్ర బృందం ఆసక్తి కనబరిచింది. ఇన్ని యాప్‌లు వాడడం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదని అభిప్రాయపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో భారీగా కరోనా పరీక్షలు చేయడం ఆశ్చర్యంగా ఉందని… దీన్ని కొనసాగించాలని సూచించింది.

కరోనా లక్షణాలు లేకపోయినా అధిక టెస్టుల ద్వారా 80 శాతం మందిని గుర్తించడం గొప్పవిషయమని కేంద్ర బృందం సభ్యులు అభినందించారు. ఏపీలో ఫెయిడ్ క్వారంటైన్‌ ఏర్పాటు చేశారా అని కేంద్ర బృందం ఆరా తీసింది. అందుకు క్వారంటైన్‌ సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని అధికారులు వివరించారు.

క్వారంటైన్‌లో ఫుడ్‌ మెనూ అద్భుతంగా ఉందని కేంద్ర బృందం కితాబిచ్చింది. కంటైన్మెంట్‌ క్లస్టర్స్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు, పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏపీలో భేష్‌ గా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు వ్యాఖ్యానించారు.

First Published:  8 May 2020 11:50 PM GMT
Next Story