Telugu Global
Cinema & Entertainment

ఈరోజే దిల్ రాజు పెళ్లి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈరోజు కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. అవును.. ఈరోజు దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నాళ్ల కిందట ఆయన తన భార్యను కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నాడు దిల్ రాజు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. నిజానికి దిల్ రాజు రెండో పెళ్లి వార్తపై చాన్నాళ్లుగా పుకార్లు నడుస్తున్నాయి. ఆయన మళ్లీ పెళ్లి చేసుకుంటారని చాలా కథనాలొచ్చాయి. కానీ దిల్ రాజు ఎప్పుడూ వాటిని […]

ఈరోజే దిల్ రాజు పెళ్లి
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈరోజు కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. అవును.. ఈరోజు దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నాళ్ల కిందట ఆయన తన భార్యను కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి జీవితంలో ఒంటరితనం అనుభవిస్తున్నాడు దిల్ రాజు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన మరో పెళ్లి చేసుకోబోతున్నాడు.

నిజానికి దిల్ రాజు రెండో పెళ్లి వార్తపై చాన్నాళ్లుగా పుకార్లు నడుస్తున్నాయి. ఆయన మళ్లీ పెళ్లి చేసుకుంటారని చాలా కథనాలొచ్చాయి. కానీ దిల్ రాజు ఎప్పుడూ వాటిని సమర్థించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఎట్టకేలకు ఆ పుకార్లను నిజం చేస్తూ ఈరోజు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ అగ్ర నిర్మాత. ఆ విషయాన్ని తను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని తన సంస్థ ట్విట్టర్ పేజీలో అధికారికంగా ప్రకటించాడు దిల్ రాజు.

అయితే పెళ్లి ఎక్కడనేది వెల్లడించలేదు. కొంతమంది షాద్ నగర్ లోని ఓ ఫామ్ హౌజ్ లో పెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజామాబాద్ లో దిల్ రాజు కట్టించిన గుడిలోనే అతడి పెళ్లి ఉండొచ్చంటున్నారు. వేదిక ఎక్కడైనా ఈరోజు సాయంత్రం దిల్ రాజు పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

First Published:  10 May 2020 1:20 AM GMT
Next Story