Telugu Global
Cinema & Entertainment

ఆ స్క్రిప్ట్ నాని కోసమేనా?

లాక్ డౌన్ టైమ్ లో డైరెక్టర్స్ అంతా కొత్త కథల మీద పడ్డారు. పూరి జగన్నాధ్, రాజమౌళి, మారుతి, వంశీ పైడిపల్లి.. ఇలా చాలామంది దర్శకులు కొత్త కథల అన్వేషణ మొదలుపెట్టామని చెప్పారు. వీళ్లలో మారుతి అందరికంటే కాస్త ముందున్నాడు. ఆల్రెడీ ఓ స్టోరీ కంప్లీట్ చేసినట్టు ప్రకటించిన ఈ దర్శకుడు, ఇప్పుడు మరో మంచి కాన్సెప్ట్ పై వర్కవుట్ ప్రారంభించాడట. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈసారి నాని కోసం మారుతి ఓ మంచి కథ […]

ఆ స్క్రిప్ట్ నాని కోసమేనా?
X

లాక్ డౌన్ టైమ్ లో డైరెక్టర్స్ అంతా కొత్త కథల మీద పడ్డారు. పూరి జగన్నాధ్, రాజమౌళి, మారుతి, వంశీ పైడిపల్లి.. ఇలా చాలామంది దర్శకులు కొత్త కథల అన్వేషణ మొదలుపెట్టామని చెప్పారు. వీళ్లలో మారుతి అందరికంటే కాస్త ముందున్నాడు. ఆల్రెడీ ఓ స్టోరీ కంప్లీట్ చేసినట్టు ప్రకటించిన ఈ దర్శకుడు, ఇప్పుడు మరో మంచి కాన్సెప్ట్ పై వర్కవుట్ ప్రారంభించాడట.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈసారి నాని కోసం మారుతి ఓ మంచి కథ రాస్తున్నాడట. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ నే మారుతి సెలక్ట్ చేసుకున్నాడు.

మారుతి ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాన్ని వినోదాత్మకంగా చెప్పడంలో దిట్ట. రీసెంట్ గా వచ్చిన ప్రతి రోజూ పండగే సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా బరువైన ఈ కాన్సెప్ట్ ను సింపుల్ గా, సరదాగా చెప్పాడు మారుతి. నానితో సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వబోతున్నాడు.

అయితే వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదు. ఎందుకంటే, ప్రస్తుతం నాని ఫుల్ బిజీ. అతడు నటించిన V సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమా ప్రమోషన్ పెండింగ్ ఉంది. దీంతో పాటు టక్ జగదీష్ షూటింగ్ ఇంకా 30శాతానికి పైగా పెండింగ్ లో ఉంది. అటు శ్యామ్ సింగరాయ్ అనే మూవీని స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయితే తప్ప నాని-మారుతి కాంబో తెరపైకి రాదు.

First Published:  10 May 2020 3:00 AM GMT
Next Story