Telugu Global
Cinema & Entertainment

మహేష్, విజయ్ దేవరకొండ సినిమా

హెడ్డింగ్ చూసి ఇదేదో మల్టీస్టారర్ సినిమా అనుకోవద్దు. మహేష్ నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోందట. ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ ఇదే. వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారనే రూమర్ జోరుగా వినిపిస్తోంది. మహేష్ ఆల్రెడీ నిర్మాణ రంగంలోకి ఎంటరయ్యాడు. తన సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అటు అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా సినిమా […]

మహేష్, విజయ్ దేవరకొండ సినిమా
X

హెడ్డింగ్ చూసి ఇదేదో మల్టీస్టారర్ సినిమా అనుకోవద్దు. మహేష్ నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోందట. ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ ఇదే. వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారనే రూమర్ జోరుగా వినిపిస్తోంది.

మహేష్ ఆల్రెడీ నిర్మాణ రంగంలోకి ఎంటరయ్యాడు. తన సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అటు అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా సినిమా నిర్మించాలని భావిస్తున్నాడట. ఈ కాంబినేషన్ ను వర్కవుట్ చేయడం కోసం నమ్రత తెరవెనక పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

తనకు మహేష్ అంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అటు మహేష్ కూడా తాజాగా జరిగిన ఓ వివాదంలో విజయ్ దేవరకొండకు పూర్తి మద్దతిచ్చాడు. ప్రస్తుతానికి తన బ్యానర్ కు సంబంధించిన నిర్మాణ బాధ్యతలన్నింటినీ నమ్రతకు అప్పగించాడు మహేష్. సో.. నమ్రత-విజయ్ దేవరకొండ కలిసి ఈ ప్రాజెక్టుపై వర్క్ చేయబోతున్నారన్నమాట.

First Published:  10 May 2020 5:25 AM GMT
Next Story