Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాపై మరో గాసిప్

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ తో పాపులర్ అయిన దర్శకుడు. ఎన్టీఆర్ హీరోగా ఈ దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కూడా నిర్థారించింది. అయితే సినిమా ఎప్పుడు ఉంటుంది… ఎలా ఉంటుంది లాంటి అంశాల్ని మాత్రం అప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే… ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పూర్తవ్వాలి. అప్పుడు కానీ ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ […]

ఎన్టీఆర్ సినిమాపై మరో గాసిప్
X

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ తో పాపులర్ అయిన దర్శకుడు. ఎన్టీఆర్ హీరోగా ఈ దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కూడా నిర్థారించింది. అయితే సినిమా ఎప్పుడు ఉంటుంది… ఎలా ఉంటుంది లాంటి అంశాల్ని మాత్రం అప్పుడే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

ఎందుకంటే… ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పూర్తవ్వాలి. అప్పుడు కానీ ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ రాదు. అంటే ఇంకా చాలా టైమ్ ఉందన్నమాట. అయినప్పటికీ ఈ కాంబినేషన్ పై పుకార్లు మాత్రం ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాను దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. తారక్ కెరీర్ లోనే రెండో పాన్ ఇండియా సినిమా (ఆర్ఆర్ఆర్ తర్వాత)గా ఇది రాబోతోందట. అంతేకాదు.. ఈ సినిమా కోసం రెండేళ్ల టైమ్ పడుతుందట. కాబట్టి కనీసం తారక్ నుంచి ఏడాదైనా బల్క్ డేట్స్ కావాలంట. ఇలా సాగుతున్నాయి ఈ సినిమా పుకార్లు.

ఈ రూమర్ల సంగతి పక్కనపెడితే.. అసలు ఈ సినిమా ఉంటుందా… ఉండదా.. అనే విషయం ఈ నెలలోనే తేలిపోతుంది. 20న తారక్ పుట్టినరోజు ఉంది. ఆరోజు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఏదైనా ఎనౌన్స్ మెంట్ వస్తే సినిమా ఉన్నట్టు. లేకపోతే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

First Published:  10 May 2020 12:07 AM GMT
Next Story