Telugu Global
Cinema & Entertainment

రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరిగింది. దిల్ రాజు పెళ్లి చేసుకున్న మహిళ పేరు తేజశ్విని అలియాస్ వైఘా రెడ్డి. లాక్ డౌన్ వల్ల అత్యంత సాధారణంగా, కేవలం కొద్ది మంది బంధువుల మధ్య ఈ పెళ్లి జరిగింది. 2017లో దిల్ రాజు భార్య అనితా రెడ్డి మరణించారు. అప్పట్నుంచి […]

రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు
X

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరిగింది. దిల్ రాజు పెళ్లి చేసుకున్న మహిళ పేరు తేజశ్విని అలియాస్ వైఘా రెడ్డి. లాక్ డౌన్ వల్ల అత్యంత సాధారణంగా, కేవలం కొద్ది మంది బంధువుల మధ్య ఈ పెళ్లి జరిగింది.

2017లో దిల్ రాజు భార్య అనితా రెడ్డి మరణించారు. అప్పట్నుంచి ఒంటరిగా ఉన్న దిల్ రాజును మరో పెళ్లి చేసుకోమని, కుటుంబ సభ్యులు బలవంతం పెట్టారు. దీంతో తనకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురైన 29 ఏళ్ల తేజశ్వినిని దిల్ రాజు పెళ్లాడారు.

ఈరోజు పెళ్లికి సంబంధించి ఫొటోల్ని విడుదల చేశారు. ఈ పెళ్లితో మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో అరడజను సినిమాలున్నాయి. వివిధ నిర్మాణ దశల్లో ఆ సినిమాలన్నీ ఉన్నాయి.

First Published:  11 May 2020 7:48 AM GMT
Next Story