Telugu Global
Cinema & Entertainment

నిఖిల్ కు మెమొరీ లాస్

లాక్ డౌన్ పూర్తయిన వెంటనే నిఖిల్ స్టార్ట్ చేయబోయే సినిమా 18 పేజెస్. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిన్న ఎలిమెంట్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మెమొరీ లాస్ పేషెంట్ గా కనిపించబోతున్నాడట నిఖిల్. అయితే సినిమా అంతా ఇదే క్యారెక్టర్ ఉండదట. సెకెండాఫ్ లో కొద్దిసేపు మాత్రం ఉంటుందట. మెమొరీ లాస్ అనగానే ఎవరికైనా గజనీ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. ఆమధ్య […]

నిఖిల్ కు మెమొరీ లాస్
X

లాక్ డౌన్ పూర్తయిన వెంటనే నిఖిల్ స్టార్ట్ చేయబోయే సినిమా 18 పేజెస్. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిన్న ఎలిమెంట్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో మెమొరీ లాస్ పేషెంట్ గా కనిపించబోతున్నాడట నిఖిల్. అయితే సినిమా అంతా ఇదే క్యారెక్టర్ ఉండదట. సెకెండాఫ్ లో కొద్దిసేపు మాత్రం ఉంటుందట.

మెమొరీ లాస్ అనగానే ఎవరికైనా గజనీ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలొచ్చాయి. ఆమధ్య భలే భలే మగాడివోయ్ అంటూ మెమొరీ లాస్ ను ఫన్నీగా కూడా చూపించాడు నాని. ఇప్పుడిదే కాన్సెప్ట్ ను 18-పేజెస్ లో కూడా చూపించబోతున్నారట.

సినిమాలో కీలకమైన ట్విస్ట్ దగ్గర ఈ ఎపిసోడ్ వస్తుందట. అయితే ఇది సీరియస్ గా ఉంటుందా.. లేక సరదాగా పెట్టిన ఎపిసోడా అనేది తేలాల్సి ఉంది. సూర్యప్రతాప్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఆనుమప పరమేశ్వరన్ లేదా అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

First Published:  10 May 2020 8:20 PM GMT
Next Story