Telugu Global
Cinema & Entertainment

లాక్ డౌన్ లో తాప్సి దినచర్య

లాక్ డౌన్ వల్ల హీరోహీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లయిన హీరోలు కుటుంబాలతో హ్యాపీగా గడిపేస్తుంటే.. పెళ్లి కాని హీరోయిన్లు నెట్ లో వెబ్ సిరీస్ లు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అయితే తాప్సి ఈ రెండు పనులు చేయడం లేదు. ఆమెకు ఇంటి పనులతో క్షణం కూడా తీరిక ఉండడం లేదంట. ఎంత బిజీ అయిపోతోందంటే.. పనులేమైనా మిస్ అవుతాయేమోనని ఆమె టైమ్ టేబుల్ కూడా రాసుకుందట. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి […]

లాక్ డౌన్ లో తాప్సి దినచర్య
X

లాక్ డౌన్ వల్ల హీరోహీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లయిన హీరోలు కుటుంబాలతో హ్యాపీగా గడిపేస్తుంటే.. పెళ్లి కాని హీరోయిన్లు నెట్ లో వెబ్ సిరీస్ లు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అయితే తాప్సి ఈ రెండు పనులు చేయడం లేదు. ఆమెకు ఇంటి పనులతో క్షణం కూడా తీరిక ఉండడం లేదంట. ఎంత బిజీ అయిపోతోందంటే.. పనులేమైనా మిస్ అవుతాయేమోనని ఆమె టైమ్ టేబుల్ కూడా రాసుకుందట.

ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు చేయాల్సిన పనులన్నింటినీ రాసి పెట్టుకుందట తాప్సి. కుకింగ్ నుంచి క్లీనింగ్ వరకు అన్ని పనులు తను మాత్రమే చేస్తోందట. దీంతో ఎంజాయ్ చేయడానికి టైమ్ దొరకడం లేదంటోంది ఈ బ్యూటీ.

నిజానికి పనిలోనే తనకు ఆనందం ఉంటుందని, అందుకే తనను తాను బిజీగా ఉంచుకోవడం కోసం ఇలా టైమ్ టేబుల్ తయారుచేసి పెట్టుకున్నానని అంటోంది తాప్సి. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉదయం వ్యాయామం, యోగా మాత్రం మిస్ అవ్వనని.. ఆ రెండు పూర్తయిన తర్వాత మిగతా పనులు మొదలుపెడతానని అంటోంది. ఇదీ.. ఈ లాక్ డౌన్ టైమ్ లో తాప్సి చేస్తున్న పని.

First Published:  11 May 2020 10:00 AM GMT
Next Story