Telugu Global
National

కరోనా టూరిస్ట్ వీసా మీద రాలేదు... తిరిగి వెళ్లిపోవడానికి...

లాక్‌డౌన్ వల్ల దేశంలో లక్షలాది ప్రాణాలు కాపాడగలిగామన్నారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర. అయితే మరింత కాలం లాక్‌డౌన్ పొడిగించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు కొద్దికాలం తగ్గినా… ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయని.. దీన్ని బట్టి పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోందన్నారు. కరోనా పూర్తిగా మాయమవుతుందని ఆశించలేమన్నారు. కరోనా దేశంలోకి టూరిస్ట్ వీసా మీద రాలేదని… అది ఇక్కడే ఉంటుందని వ్యాఖ్యానించారు. […]

కరోనా టూరిస్ట్ వీసా మీద రాలేదు... తిరిగి వెళ్లిపోవడానికి...
X

లాక్‌డౌన్ వల్ల దేశంలో లక్షలాది ప్రాణాలు కాపాడగలిగామన్నారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర. అయితే మరింత కాలం లాక్‌డౌన్ పొడిగించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కేసులు కొద్దికాలం తగ్గినా… ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయని.. దీన్ని బట్టి పెరుగుదల అనివార్యంగా కనిపిస్తోందన్నారు. కరోనా పూర్తిగా మాయమవుతుందని ఆశించలేమన్నారు.

కరోనా దేశంలోకి టూరిస్ట్ వీసా మీద రాలేదని… అది ఇక్కడే ఉంటుందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగం లేదు అని తాను అనడం లేదని… కానీ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే ఆర్థికంగా అనేక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.

కరోనా మృతుల సంఖ్య ప్రతి మిలియన్‌కు ప్రపంచంలో సగటున 35 మందిగా ఉండగా… ఇండియాలో అది కేవలం 1. 4గా మాత్రమే ఉందన్నారు. అమెరికాలో ఈ సగటు 228గా ఉందని గుర్తు చేశారు. కరోనా తీవ్రతను తట్టుకునేలా ఆస్పత్రులు, వైద్య పరికరాలు సిద్ధం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కరోనా బాధితులను ఐసోలేట్ చేస్తూ వెళ్లడమే మార్గమన్నారు.

తిరిగి వెళ్లిపోవడానికి కరోనా ఏమీ టూరిస్ట్ వీసా మీద రాలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని దానితో కలిసి జీవించడం ఎలా అన్న దానిపైనే శ్రద్ధపెట్టాలని ఆనంద్ మహీంద్ర సూచించారు.

First Published:  11 May 2020 10:19 PM GMT
Next Story