Telugu Global
Cinema & Entertainment

మళ్లీ అగ్గి రాజేసిన బండ్ల గణేష్

బండ్ల గణేశ్.. వివాదాలకు మారుపేరు. తన మాటతీరుతో, వ్యవహారశైలితో ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు పుట్టిస్తుంటాడు ఈ నిర్మాత కమ్ పొలిటీషియన్. ఇప్పుడీ నిర్మాత హరీష్ శంకర్ లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ పెట్టిన హరీశ్.. అందులో తన పేరును చేర్చకపోవడంపై కోపం వ్యక్తంచేశాడు. హరీష్ తన పేరును ప్రస్తావించకపోవడాన్ని అతడి సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రకటించాడు బండ్ల గణేశ్. అవకాశాల్లేక ఇబ్బంది పడుతుంటే.. తను దగ్గరుండి […]

మళ్లీ అగ్గి రాజేసిన బండ్ల గణేష్
X

బండ్ల గణేశ్.. వివాదాలకు మారుపేరు. తన మాటతీరుతో, వ్యవహారశైలితో ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు పుట్టిస్తుంటాడు ఈ నిర్మాత కమ్ పొలిటీషియన్. ఇప్పుడీ నిర్మాత హరీష్ శంకర్ లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ పెట్టిన హరీశ్.. అందులో తన పేరును చేర్చకపోవడంపై కోపం వ్యక్తంచేశాడు.

హరీష్ తన పేరును ప్రస్తావించకపోవడాన్ని అతడి సంస్కారానికే వదిలేస్తున్నానని ప్రకటించాడు బండ్ల గణేశ్. అవకాశాల్లేక ఇబ్బంది పడుతుంటే.. తను దగ్గరుండి గబ్బర్ సింగ్ డైరక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చానని.. ఆ కృతజ్ఞత హరీష్ లో కనిపించలేదన్నాడు.

ఎన్టీఆర్ తో సినిమా ఇస్తానంటూ నల్లమలపు బుజ్జి హరీష్ ను చాన్నాళ్లు తిప్పుకున్నారని, కానీ అవకాశం ఇవ్వలేదని.. ఆ టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన హరీష్ కు తను పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చానని గుర్తుచేసుకున్నాడు బండ్ల.

హరీష్ కోసం ఇంత చేస్తే, అతడు తన పేరును ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నాడు బండ్ల గణేశ్. గబ్బర్ సింగ్ టైమ్ లో తనకు హరీష్ కు ఎలాంటి మనస్పర్థలు రాలేదని, చెప్పిన బడ్జెట్ లోనే సినిమాను పూర్తిచేశాడని అన్నాడు.

First Published:  12 May 2020 10:45 AM GMT
Next Story