Telugu Global
Cinema & Entertainment

మరో బడా ఛాన్స్ కొట్టేసిన దేవిశ్రీప్రసాద్

ప్రస్తుతం భారీ సినిమాల ఆఫర్లన్నీ దేవిశ్రీ, తమన్ మధ్యే తిరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ అవకాశాలు ప్రస్తుతం తమన్ కే వస్తున్నాయి. దేవిశ్రీ పనితీరుపై కాస్త విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో బ్రహ్మాండమైన ఆఫర్ దక్కించుకున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు సంగీతం అందించే అవకాశం దేవిశ్రీని వరించింది. త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు పవన్. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ ప్రాజెక్టులోకి […]

మరో బడా ఛాన్స్ కొట్టేసిన దేవిశ్రీప్రసాద్
X

ప్రస్తుతం భారీ సినిమాల ఆఫర్లన్నీ దేవిశ్రీ, తమన్ మధ్యే తిరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ అవకాశాలు ప్రస్తుతం తమన్ కే వస్తున్నాయి.

దేవిశ్రీ పనితీరుపై కాస్త విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో బ్రహ్మాండమైన ఆఫర్ దక్కించుకున్నాడు ఈ మ్యూజిక్ డైరక్టర్. అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు సంగీతం అందించే అవకాశం దేవిశ్రీని వరించింది.

త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు పవన్. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడీ ప్రాజెక్టులోకి దేవిశ్రీప్రసాద్ ఎంటరయ్యాడు.

పవన్-హరీష్ కాంబోలో గబ్బర్ సింగ్ థియేటర్లలోకొచ్చి సరిగ్గా 8 ఏళ్లయింది. ఈ సందర్భంగా అప్పటి అనుభవాల్ని పంచుకున్న హరీష్ శంకర్.. మళ్లీ ఇన్నేళ్లకు పవన్ తో సినిమా చేయబోతున్నానని, దానికి మరోసారి దేవిశ్రీ సంగీతం అందించబోతున్నాడని ప్రకటించాడు.

పవన్-దేవిశ్రీ కాంబోలో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. పవన్ నటించిన జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్ల కాంబోలో సినిమా రాబోతోంది.

First Published:  13 May 2020 12:00 AM GMT
Next Story