Telugu Global
Cinema & Entertainment

వచ్చే ఏడాది నిహారిక పెళ్లి

టాలీవుడ్ లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. రేపు నిఖిల్ పెళ్లి చేసుకుంటున్నాడు. రానా కూడా పెళ్లి కబురు మోసుకొచ్చాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ కూడా మొదలైంది. కుదిరితే వచ్చే ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి చేసేస్తానంటున్నాడు నాగబాబు. ఓ వెబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు ఈ విషయాన్ని బయటపెట్టాడు. ముందుగా నిహారికకు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నాటికి పెళ్లి చేసేస్తామని.. ఆ వెంటనే […]

వచ్చే ఏడాది నిహారిక పెళ్లి
X

టాలీవుడ్ లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. రేపు నిఖిల్ పెళ్లి చేసుకుంటున్నాడు. రానా కూడా పెళ్లి కబురు మోసుకొచ్చాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ కూడా మొదలైంది. కుదిరితే వచ్చే ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి చేసేస్తానంటున్నాడు నాగబాబు.

ఓ వెబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు ఈ విషయాన్ని బయటపెట్టాడు. ముందుగా నిహారికకు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నాటికి పెళ్లి చేసేస్తామని.. ఆ వెంటనే కొన్ని నెలలకు వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఉంటుందని స్పష్టంచేశారు. ఒకవేళ వచ్చే ఏడాది వరుణ్ కు పెళ్లి చేయడం కుదరకపోతే.. 2022లో తప్పకుండా పెళ్లి జరిగి తీరుతుందని అన్నారు.

నాగబాబు ఇంత గట్టిగా చెబుతున్నారంటే అక్కడేదో ఉండే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుణ్ ఆల్రెడీ ప్రేమలో ఉండి ఉండొచ్చు. లేదంటే వరుణ్ కు ఆల్రెడీ ఏదో సంబంధం చూసి ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వకపోతే నాగబాబు ఇంత గట్టిగా మాట్లాడరు. సో.. త్వరలోనే మెగా కాంపౌండ్ లో పెళ్లిబాజా మోగబోతోందన్నమాట.

First Published:  13 May 2020 10:00 AM GMT
Next Story