Telugu Global
Cinema & Entertainment

ప్రియమణి ఇప్పుడేం చేస్తోంది?

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అందర్లానే ప్రియమణి కూడా ఇంట్లోనే కూర్చుంది. మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా తానేం చేయడం లేదంటోంది ప్రియమణి. ఇంటి పనితో పాటు టీవీతోనే కాలక్షేపం అయిపోతోందని చెప్పుకొచ్చింది. “నేనేం కొత్తగా చేయడం లేదు. నాకు ఎప్పుడూ ఇంట్లో పని ఉంటుంది. అదే పని ఈసారి ఇంకాస్త ఎక్కువైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పని చేసుకుంటాను. మధ్యమధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలు […]

ప్రియమణి ఇప్పుడేం చేస్తోంది?
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. అందర్లానే ప్రియమణి కూడా ఇంట్లోనే కూర్చుంది. మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా తానేం చేయడం లేదంటోంది ప్రియమణి. ఇంటి పనితో పాటు టీవీతోనే కాలక్షేపం అయిపోతోందని చెప్పుకొచ్చింది.

“నేనేం కొత్తగా చేయడం లేదు. నాకు ఎప్పుడూ ఇంట్లో పని ఉంటుంది. అదే పని ఈసారి ఇంకాస్త ఎక్కువైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పని చేసుకుంటాను. మధ్యమధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలు కవర్ చేస్తున్నాను.”

అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఒక విషయంలో మాత్రం ప్రియమణి తన విలక్షణ చాటుకుంది. లాక్ డౌన్ టైమ్ లో ప్రమోషన్ కోసం హీరోయిన్లంతా లైవ్ ఛాట్స్ లోకి వస్తున్న వేళ.. ప్రియమణి మాత్రం అలాంటి వాటికి నో చెబుతోంది.

ఇప్పటికిప్పుడు ప్రచారం అవసరం లేదని, ఫ్యాన్స్ తో టచ్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదని అంటోంది. ఎప్పట్నుంచో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్న తనకు లాక్ డౌన్ రూపంలో బ్రేక్ దొరికిందని అంటోంది ప్రియమణి.

ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.

First Published:  12 May 2020 8:30 PM GMT
Next Story