Telugu Global
Cinema & Entertainment

ఆర్‌ఆర్‌ఆర్‌ పై మరో క్లారిటీ వచ్చేసింది

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి మొన్నటివరకు ఓ పుకారు జోరుగా నడిచింది. అజయ్ దేవగన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనిపై రాజమౌళి స్పందించాడు. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ విలన్ కాదని స్పష్టంచేశాడు. పైగా హీరోలకు ప్రేరణ ఇచ్చే పాత్రలో ఆయన కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. “అజయ్ దేవగన్ లాంటి వ్యక్తి ఏదైనా చెబితే ప్రజలు నమ్ముతారు, వింటారు. నిజమే కదా అనే భావన వస్తుంది. ఆయన స్టార్ […]

ఆర్‌ఆర్‌ఆర్‌ పై మరో క్లారిటీ వచ్చేసింది
X

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి మొన్నటివరకు ఓ పుకారు జోరుగా నడిచింది. అజయ్ దేవగన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు దీనిపై రాజమౌళి స్పందించాడు. ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ విలన్ కాదని స్పష్టంచేశాడు. పైగా హీరోలకు ప్రేరణ ఇచ్చే పాత్రలో ఆయన కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

“అజయ్ దేవగన్ లాంటి వ్యక్తి ఏదైనా చెబితే ప్రజలు నమ్ముతారు, వింటారు. నిజమే కదా అనే భావన వస్తుంది. ఆయన స్టార్ డమ్, స్టామినా అలాంటిది. ఆర్ఆర్ఆర్ లో కూడా అజయ్ దేవగన్ పాత్ర ఈ ఛాయల్లోనే ఉంటుంది. ఓ కీలకమైన సమయంలో అజయ్ దేవగన్ పాత్ర వల్ల రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు.”

ఇలా ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ పాత్రపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. మరోవైపు సినిమా విడుదలపై కూడా స్పందించాడు. షూటింగ్స్ ఎప్పట్నుంచి ప్రారంభమౌతాయో తెలియదని, సెట్స్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై స్పందిస్తానంటున్నాడు జక్కన్న.

First Published:  12 May 2020 10:30 PM GMT
Next Story