Telugu Global
National

జూలై తొలివారంలో తెలంగాణ ఎంసెట్‌ !

తెలంగాణలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభమైంది. జూన్‌ రెండో వారంలో ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ వేగంగా సాగుతోంది. మరోవైపు ఈ నెలలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 8 పరీక్షలు హైకోర్టు అనుమతితో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జూలై తొలివారంలో తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలై 6న నిర్వహిస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇతర జాతీయ పరీక్షలతో పాటు […]

జూలై తొలివారంలో తెలంగాణ ఎంసెట్‌ !
X

తెలంగాణలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభమైంది. జూన్‌ రెండో వారంలో ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ వేగంగా సాగుతోంది.

మరోవైపు ఈ నెలలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 8 పరీక్షలు హైకోర్టు అనుమతితో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

జూలై తొలివారంలో తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలై 6న నిర్వహిస్తే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇతర జాతీయ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్స్‌ తో పాటు నీట్‌ ఎగ్జామ్స్‌తో డేట్స్‌ క్లాష్‌ కావొద్దు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ జూలై 18నుంచి 23 వరకు నిర్వహిస్తామని కేంద్రం తేదీలు ప్రకటించింది. ఇక నీట్‌ ఎగ్జామ్‌ జూలై 26న నిర్వహించబోతున్నారు. దీంతో వాటికంటే ముందు ఎంసెట్‌ నిర్వహిస్తే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ జూలై తొలివారంలో ఎంసెట్‌ నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఆగస్ట్‌లో నిర్వహించడం బెటర్‌ అని అధికారులు అంటున్నారు. ఏపీ ఎంసెట్‌తో పాటు జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలతో డేట్లు క్లాష్‌ అయ్యే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.

అప్పటి వరకూ కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోతే… ఆగస్ట్‌ మొదటి వారంలో ఎంసెట్‌ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. ఒక వేళ కరోనా అదుపులో ఉండి…పరిస్థితులు అనుకూలిస్తే జూలై మొదటివారంలోనే ఎంసెట్‌ నిర్వహించాలనేది అధికారుల నిర్ణయంగా తెలుస్తోంది. తెలంగాణ ఎంసెట్‌ కోసం దాదాపు రెండు లక్షలమంది విద్యార్ధులు ఇప్పటికే అప్లయ్‌ చేసుకున్నారు.

First Published:  12 May 2020 8:03 PM GMT
Next Story