Telugu Global
Cinema & Entertainment

రానాకు శుభాకాంక్షలు చెప్పని త్రిష

రీసెంట్ గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు రానా. మిహీకా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. దీంతో ప్రముఖులంతా రానాకు శుభాకాంక్షలు అందించారు. ఈ విషయంలో హీరోహీరోయిన్లు అనే తేడా లేకుండా అంతా స్పందించారు. అయితే త్రిష మాత్రం ఇప్పటివరకు రానాకు శుభాకాంక్షలు చెప్పలేదు. తనకు టాలీవుడ్ నుంచి బన్నీ, రానా మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది త్రిష. ఈ లాక్ డౌన్ టైమ్ లో వాళ్లతో ఛాట్ చేస్తుంటానని కూడా చెప్పుకొచ్చింది. […]

రానాకు శుభాకాంక్షలు చెప్పని త్రిష
X

రీసెంట్ గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు రానా. మిహీకా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. దీంతో ప్రముఖులంతా రానాకు శుభాకాంక్షలు అందించారు. ఈ విషయంలో హీరోహీరోయిన్లు అనే తేడా లేకుండా అంతా స్పందించారు. అయితే త్రిష మాత్రం ఇప్పటివరకు రానాకు శుభాకాంక్షలు చెప్పలేదు.

తనకు టాలీవుడ్ నుంచి బన్నీ, రానా మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది త్రిష. ఈ లాక్ డౌన్ టైమ్ లో వాళ్లతో ఛాట్ చేస్తుంటానని కూడా చెప్పుకొచ్చింది. అలాంటి ఓ బెస్ట్ ఫ్రెండ్ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెడితే త్రిష శుభాకాంక్షలు చెప్పకపోవడం కాస్త విడ్డూరమే.

నిజానికి రానా-త్రిష మధ్య గతంలో చాలా వ్యవహారం నడిచింది. ఓ బాలీవుడ్ టాక్ షోలో తను గతంలో త్రిషతో డేటింగ్ చేసిన విషయాన్ని కూడా రానా బయటపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. స్నేహితులుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో రానా, మిహీకాతో ప్రేమలో పడడం పెళ్లికి రెడీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. త్రిష మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. తాజాగా ఫ్యాన్స్ తో ఛాట్ చేస్తూ.. తను సింగిల్ అనే విషయాన్ని మరోసారి ప్రకటించింది ఈ బ్యూటీ.

First Published:  14 May 2020 9:51 AM GMT
Next Story