Telugu Global
Cinema & Entertainment

రవితేజ కూడా రెడీ

థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. బహుశా జులైలో థియేటర్లు తెరిచే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు థియేటర్లు తెరిచినా రెడీగా రిలీజ్ అయ్యేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రిలీజ్ డేట్ దొరకదనే భయంతో వద్దన్నా మూవీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి క్రాక్ సినిమా కూడా చేరింది. రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రాక్ సినిమా 10 రోజుల షూటింగ్ మినహా మొత్తం పూర్తయిందని ప్రకటించింది యూనిట్. ఈ లాక్ డౌన్ […]

రవితేజ కూడా రెడీ
X

థియేటర్లు తెరుచుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. బహుశా జులైలో థియేటర్లు తెరిచే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు థియేటర్లు తెరిచినా రెడీగా రిలీజ్ అయ్యేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రిలీజ్ డేట్ దొరకదనే భయంతో వద్దన్నా మూవీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి క్రాక్ సినిమా కూడా చేరింది.

రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రాక్ సినిమా 10 రోజుల షూటింగ్ మినహా మొత్తం పూర్తయిందని ప్రకటించింది యూనిట్. ఈ లాక్ డౌన్ టైమ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తిచేస్తున్నామని, థియేటర్లు తెరిచిన వెంటనే రిలీజ్ కు రెడీ అవుతున్నామని ప్రకటించారు.

ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నాని నటించిన V సిమాతో పాటు, సోలో బతుకే సో బెటరు, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, రెడ్, నిశ్శబ్దం, ఉప్పెన, అరణ్య, శ్రీకారం.. ఇలా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. చూస్తుంటే.. థియేటర్లు తెరిచిన తర్వాత విడుదల తేదీల విషయంలో చాలా వివాదాలు చెలరేగేలా కనిపిస్తోంది పరిస్థితి. ఇప్పుడు రవితేజ కూడా రంగంలోకి దిగడంతో పోటీ ఇంకాస్త పెరిగింది.

First Published:  14 May 2020 11:00 PM GMT
Next Story