Telugu Global
NEWS

వ్యవసాయ రంగంపై జగన్‌ కీలక నిర్ణయాలు

రైతులకు అండగా నిలిచే విషయంలో తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి…. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే రైతులతో మాట్లాడారు. రైతుల మధ్య కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి రావడం బాధగా ఉందన్నారు. కానీ కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడాల్సి వస్తోందన్నారు. అన్నం పెట్టే రైతు కోసం ఎంత చేసినా అది […]

వ్యవసాయ రంగంపై జగన్‌ కీలక నిర్ణయాలు
X

రైతులకు అండగా నిలిచే విషయంలో తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి…. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే రైతులతో మాట్లాడారు.

రైతుల మధ్య కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి రావడం బాధగా ఉందన్నారు. కానీ కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మాట్లాడాల్సి వస్తోందన్నారు. అన్నం పెట్టే రైతు కోసం ఎంత చేసినా అది తక్కువే అవుతుందన్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలోనే వ్యవసాయం ద్వారా 62 శాతం మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.

తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మే 30న తన పాలనను రైతులకు అంకితమిస్తూ 10వేల 641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కేంద్రాల ద్వారానే విత్తనాలు, మందులు అందిస్తామన్నారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్వహిస్తామన్నారు.

ఈ రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో వ్యవసాయ స్థితిగతులను మార్చే విధంగా ఉంటాయన్నారు.ఈ కేంద్రాల ద్వారానే నాణ్యత గ్యారెంటీతో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందిస్తామన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, మందులు కొని ఇక రైతులు మోసపోయే అవకాశం లేకుండా ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయిస్తామని సీఎం చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏఏ పంటలకు డిమాండ్‌ ఉంది అన్న దానిపై ఆర్‌బీకే ద్వారా సూచనలు అందిస్తామన్నారు. భూసారపరీక్షలు నిర్వహించేందుకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక ల్యాబ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏఏ పంటను, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు అన్న దానిపై డేటా సిద్ధం చేస్తామన్నారు.

రైతు రూపాయి కడితే మిగిలిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆర్‌బీకేల ద్వారా ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆర్‌బీకేకు మార్కెటింగ్‌ శాఖ మధ్య అనుసంధానం ఉంటుందని… ఏ రైతు అయినా తన పంటను అమ్ముకునే విషయంలో ఇబ్బంది పడితే తక్షణం ప్రభుత్వం రంగంలోకి దిగుతుందన్నారు. రైతుల కోసం త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి, మండల స్థాయిలో ఒకటి చొప్పున వ్యవసాయ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఏ రైతు పంట అమ్ముకునే విషయంలో ఇబ్బంది పడకుండా మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. మరో ఏడాది సమయం ఇస్తే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సచివాలయం వద్ద వైఎస్‌ఆర్‌ జనతా బజార్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు పండించే పంటలన్నీ అమ్ముకునే ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు మరో ఏడాది సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు.

రైతు ఉత్పత్తుల్లో కనీసం 30శాతం మార్కెటింగ్ శాఖే అమ్మగలిగితే రైతులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. త్వరలోనే గ్రామాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రేడింగ్, ప్యాకింగ్ అన్ని గ్రామాల్లోనే జరిగేలా వ్యవస్థను తీసుకొస్తామన్నారు.

50 శాతం మంది రైతులకు సగటున 1.25 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. ఇలాంటి రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా ఉండేందుకే రైతు భరోసా అందిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 46 లక్షల 69వేల మంది రైతులకు 6, 534 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు చెల్లించామన్నారు. ఈ ఏడాది దాదాపు 49 లక్షల మంది రైతులకు నేడు ఆర్థిక సాయం చేయబోతున్నామని చెప్పారు. ప్రతి రైతుకు 13,500 పెట్టుబడి కోసం ఇస్తున్నామన్నారు. తక్కువ పొలం ఉన్న వారు ఈ డబ్బుతోనే పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఐదేళ్లలో ఒక్కో రైతుకు 50వేలు ఇస్తామని మానిఫెస్టోలో చెప్పామని… కానీ ఇప్పుడు 67వేల 500 రూపాయలు పెట్టుబడిగా ఇస్తున్నామని వివరించారు. వెనుకబడిన వర్గాల కౌలురైతులకు కూడా రైతు భరోసా కింద డబ్బులిస్తున్నామని చెప్పారు. నగదు బదిలీ కాకుంటే కాల్‌ సెంటర్‌ 1902 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అర్హత ఉండి డబ్బులు రాకపోతే గ్రామ సచివాలయం వద్దకు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు.

జగన్‌కు ఓటు వేసినా వేయకపోయినా సరే ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు, పార్టీలకు, కులాలకు అతీతంగా పథకాలు అందిస్తామన్నారు. మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన మే 30న తన పాలనను రైతులకు అంకితమిస్తూ 10వేల 641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కేంద్రాల ద్వారానే విత్తనాలు, మందులు అందిస్తామన్నారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్వహిస్తామన్నారు.

First Published:  15 May 2020 2:01 AM GMT
Next Story