Telugu Global
NEWS

నిమ్స్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ... ఇంకా గాంధీలో చేరని 60 మంది రోగులు

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా ఇంకా గాంధీ ఆసుపత్రిలో రిపోర్టు చేయకుండా పోయిన 60 మంది పేషెంట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వైరాలజీ విభాగం మార్చి నెల రెండో వారం నుంచి 2000 మంది శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేశారు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి వచ్చిన ఈ శాంపిల్స్ వల్ల 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కానీ ఇటు నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం కానీ, […]

నిమ్స్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ... ఇంకా గాంధీలో చేరని 60 మంది రోగులు
X

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా ఇంకా గాంధీ ఆసుపత్రిలో రిపోర్టు చేయకుండా పోయిన 60 మంది పేషెంట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వైరాలజీ విభాగం మార్చి నెల రెండో వారం నుంచి 2000 మంది శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేశారు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి వచ్చిన ఈ శాంపిల్స్ వల్ల 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కానీ ఇటు నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం కానీ, ఇటు కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ఈ విషయాన్ని కోవిడ్ 19 రోగులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రికి తెలియజేయలేదు.

నిమ్స్ వైరాలజీ విభాగం నిర్థారించిన వారిలో కేవలం ఐదుగురు మాత్రమే గాంధీ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిసింది. కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి వచ్చిన శాంపిల్స్ ఒక్కింటికి రూ.4500 రూపాయలకు నిమ్స్ వైరాలజీ విభాగం పరీక్షలు చేస్తోంది. పరీక్షల్లో వచ్చిన ఫలితాలను తిరిగి సదరు కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించారు. కానీ, కరోనా పాజిటివ్‌ల గురించి ప్రభుత్వానికి మాత్రం తెలియజేయలేదు.

ఈ విషయంపై నిమ్స్ సిబ్బందిని ప్రశ్నించగా… రోగుల సమాచారాన్ని కరోనా నోడల్ ఏజెన్సీలైన జీహెచ్ఎంసీ, జిల్లా వైద్యాధికారికి తెలియజేయడం మా పని కాదని స్పష్టం చేశారు. పేషెంట్ల శాంపిల్స్ పంపిన కార్పొరేట్ ఆసుపత్రులే రోగుల గురించిన సమాచారాన్ని నోడల్ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. సదరు రోగిని గాంధీ ఆసుపత్రికి తరలించాల్సింది కూడా కార్పొరేట్ యాజమాన్యాల బాధ్యతేనని అన్నారు.

కాగా, రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య సమన్వయం సరిగా లేదనే విషయం ఈ ఒక్క సంఘటనతో తేటతెల్లమైందని విమర్శలు వస్తున్నాయి.

కాగా, నిమ్స్‌ చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన రోగుల్లో ఐదుగురు గాంధీకి వచ్చారు. ప్రభుత్వ వర్గాలు చేసిన హోం క్వారంటైన్ ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి సదరు రోగులను గాంధీకి పంపినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

మరోవైపు హైదరాబాద్ జిల్లా (జీహెచ్ఎంసీ పరిధి) పరిధిలోని కోవిడ్-19 కేసుల డేటాను సేకరించాల్సిన డీఎంహెచ్‌వో వద్ద ఈ 60 మందికి సంబంధించిన వివరాలే లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 60 మంది హోం క్వారంటైన్‌లో ఉండొచ్చని లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అయినా తీసుకుంటుండొచ్చని జిల్లా వైద్యాధికారి కార్యాలయం అంటోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో అత్యధిక మందికి కరోనా లక్షణాలు ఉండట్లేదని అందుకే వారికి హోం క్వారంటైన్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ వర్గాలకు కూడా దీనికి సంబంధించిన వివరాలు అందలేదని.. కార్పొరేట్ ఆసుపత్రులు సరైన సమాచారం అందించి ఉంటే సంబంధిత ప్రాంతాలను కంటైన్మెంట్‌లుగా గుర్తించి సెకెండరీ కాంటాక్ట్‌లకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేది. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్. జే. వెంకట్ నిరాకరించారు.

First Published:  16 May 2020 2:26 AM GMT
Next Story