Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా 2 పార్టులుగా రావడం లేదు

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమాపై 2 రోజులుగా ఓ గాసిప్ జోరుగా నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారనేది ఆ పుకారు. అయితే అందులో నిజం లేదని యూనిట్ స్పష్టంచేసింది. తాజాగా ఓ తమిళ మీడియాతో దర్శకుడు శంకర్ మాట్లాడాడు. ఇండియన్-2 రెండు భాగాలుగా వస్తోందంట కదా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగానే శంకర్ అవాక్కయ్యాడు. అవునా.. నాకు తెలియదే అంటూ జోకు పేల్చాడు. తన సినిమా 2 […]

ఆ సినిమా 2 పార్టులుగా రావడం లేదు
X

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమాపై 2 రోజులుగా ఓ గాసిప్ జోరుగా నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారనేది ఆ పుకారు. అయితే అందులో నిజం లేదని యూనిట్ స్పష్టంచేసింది.

తాజాగా ఓ తమిళ మీడియాతో దర్శకుడు శంకర్ మాట్లాడాడు. ఇండియన్-2 రెండు భాగాలుగా వస్తోందంట కదా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగానే శంకర్ అవాక్కయ్యాడు. అవునా.. నాకు తెలియదే అంటూ జోకు పేల్చాడు. తన సినిమా 2 భాగాలుగా వచ్చే అవకాశం లేదని స్పష్టంచేశాడు శంకర్.

తెలుగులో బాహుబలి సినిమా 2 భాగాలుగా వచ్చింది. ఈ తరహాలో ఇండియన్-2 సినిమా రెండు భాగాలుగా వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమైనా ఉంటే ముందుగానే చెప్పేవాడినని అంటున్నాడు శంకర్. ఎందుకంటే, తన సినిమా 2 భాగాలుగా వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. తన సినిమా 2 భాగాలుగా రావడం లేదు కాబట్టి తనకు ఆ టెన్షన్ లేదని స్పష్టంచేశాడు.

First Published:  15 May 2020 11:15 PM GMT
Next Story