Telugu Global
Cinema & Entertainment

సంపత్ నంది దర్శకత్వంలో పవన్... అయితే...

ఇదేదో గాసిప్ కాదు. అలా అని నిజం కూడా కాదు. దర్శకుడు సంపత్ నంది చిరకాల కోరిక ఇది. ఎప్పటికైనా పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తానంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం సీటీమార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ డైరక్టర్.. త్వరలోనే పవన్ ను కలుస్తానంటున్నాడు. “పవన్ ఇక సినిమాలు చేయరనుకున్నాను. నా కల నెరవేరదని భావించాను. కానీ ఆయన మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అందుకే వెంటనే ఆయన కోసం స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. […]

సంపత్ నంది దర్శకత్వంలో పవన్... అయితే...
X

ఇదేదో గాసిప్ కాదు. అలా అని నిజం కూడా కాదు. దర్శకుడు సంపత్ నంది చిరకాల కోరిక ఇది. ఎప్పటికైనా పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తానంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం సీటీమార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ డైరక్టర్.. త్వరలోనే పవన్ ను కలుస్తానంటున్నాడు.

“పవన్ ఇక సినిమాలు చేయరనుకున్నాను. నా కల నెరవేరదని భావించాను. కానీ ఆయన మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. అందుకే వెంటనే ఆయన కోసం స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. వంద శాతం పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తా. స్క్రిప్ట్ అద్భుతంగా వస్తోంది.”

గోపీచంద్, తమన్న హీరోహీరోయిన్లుగా ప్రస్తుతం సీటీమార్ అనే సినిమా చేస్తున్నాడు సంపత్ నంది. ఆ సినిమా రిలీజైన వెంటనే పవన్ ను కలుస్తానంటున్నాడు. తను రాసుకున్న స్క్రిప్ట్ ను వినిపిస్తానని, ఎలాగైనా పవన్ ను ఒప్పిస్తానని అంటున్నాడు.

సంపత్ నందికి మెగాకాంపౌండ్ లో పరిచయాలున్నాయి. గతంలో రామ్ చరణ్ హీరోగా రచ్చ అనే సినిమా చేశాడు ఈ దర్శకుడు. కాబట్టి రామ్ చరణ్ రిఫరెన్స్ తో సంపత్ నంది, పవన్ ను కలిసే ఛాన్స్ ఉంది.

First Published:  15 May 2020 8:30 PM GMT
Next Story