Telugu Global
NEWS

ఏపీలో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు

ఏపీలో సంక్షేమ బాట కొనసాగుతోంది. కరోనా కాలంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు కోత పెట్టాయి. కానీ ఏపీ ప్రభుత్వం సంక్షేమ దూకుడు కొనసాగిస్తోంది. రైతు బంధు, జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. తాజాగా మరో కొత్త పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఆ కొత్త పథకం పేరు వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌. ఇప్పటికే ఏపీలో గ్రామ సచివాలయం […]

ఏపీలో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు
X

ఏపీలో సంక్షేమ బాట కొనసాగుతోంది. కరోనా కాలంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు కోత పెట్టాయి. కానీ ఏపీ ప్రభుత్వం సంక్షేమ దూకుడు కొనసాగిస్తోంది.

రైతు బంధు, జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.

తాజాగా మరో కొత్త పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. ఆ కొత్త పథకం పేరు వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌.

ఇప్పటికే ఏపీలో గ్రామ సచివాలయం వ్యవస్థ నడుస్తోంది. గ్రామవాలంటీర్ల ద్వారా ప్రజలకు విస్తృతస్థాయి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కాలంలో వాలంటీర్ల సేవలను పలువురు కొనియాడారు.

ఇప్పుడు ప్రతిగ్రామంలో ఓ విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్‌ క్లినిక్‌ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన వైద్యవ్యవస్థ ఉండాలనేది సీఎం జగన్‌ ఆలోచన.

సబ్‌ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించేందుకు… వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 10 వేల వైఎస్‌ఆర్‌ క్లినిక్స్ లు నిర్మించబోతున్నారు. వీటి కోసం సర్కార్‌ దాదాపు రూ.2026 కోట్లు ఖర్చు చేయబోతుంది.

ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్‌ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. సబ్‌ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను అధికారులు గుర్తించారు. మరో 6 వేల సబ్‌సెంటర్లకు స్థలాలను అన్వేషిస్తున్నారు. జూన్‌ 15లోగా స్థలాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్‌ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు.

కేరళ తరహాలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై సీఎం జగన్‌ దృష్టిపెట్టారు. ఈ విలేజ్‌ క్లీనిక్‌ల ద్వారా వైద్యం ప్రజల ముంగిటకు చేర్చాలనేది సీఎం ఆశయంగా కన్పిస్తోంది.

First Published:  15 May 2020 11:15 PM GMT
Next Story