Telugu Global
NEWS

మహారాష్ట్రను వీడని కరోనా... 30 వేలు దాటిన కేసులు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 1606 కేసులు నమోదు అయ్యాయి. దీంతో 30 వేల మార్క్‌ను దాటింది. ఒక్కరోజే 67 మంది వైరస్‌తో మృతిచెందారు. ముంబైలో కేసుల సంఖ్య 18వేల 555కి చేరింది. శనివారం ఒక్కరోజే ముంబై నగరంలో 884 కేసులు పాజిటివ్‌ గా తేలాయి. దేశంలో ముంబై కరోనా సెంటర్‌గా మారింది. ఇక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు 24గంటల్లో 41 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 696 మంది ఈ నగరంలో […]

మహారాష్ట్రను వీడని కరోనా... 30 వేలు దాటిన కేసులు
X

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 1606 కేసులు నమోదు అయ్యాయి. దీంతో 30 వేల మార్క్‌ను దాటింది. ఒక్కరోజే 67 మంది వైరస్‌తో మృతిచెందారు. ముంబైలో కేసుల సంఖ్య 18వేల 555కి చేరింది. శనివారం ఒక్కరోజే ముంబై నగరంలో 884 కేసులు పాజిటివ్‌ గా తేలాయి.

దేశంలో ముంబై కరోనా సెంటర్‌గా మారింది. ఇక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు 24గంటల్లో 41 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 696 మంది ఈ నగరంలో వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 22,479 యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి.

ఇటు తెలంగాణలో కొత్తగా మరో 55 కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 1509కి చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 44 కేసులు పాజిటివ్‌ తేలితే….కొత్తగా సంగారెడ్డిలో రెండు, రంగారెడ్డిలో 1, వలస కూలీల్లో మరో 8మందికి పాజిటివ్‌ వచ్చింది.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,205. శనివారం కొత్తగా మరో 48 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 803, ఇప్పటివరకూ 1,353 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 49 మంది మృతిచెందారు.

First Published:  16 May 2020 8:46 PM GMT
Next Story