షార్ట్ ఫిలిం చేసిన పాయల్ రాజ్ పుత్

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. నచ్చిన వ్యాపకంలో మునిగిపోయారు. పాయల్ కూడా అదే పని చేస్తోంది. రోజూ కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటోంది. తన క్వారంటైన్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతోంది. ఇవి కాకుండా ఇప్పుడు మరో పని కూడా చేసింది పాయల్. ఏకంగా ఓ షార్ట్ ఫిలిం తీసి రిలీజ్ చేసింది.

లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్స్ లేవు కదా, మరి ఈ షార్ట్ ఫిలిం ఎలా తీశారనే కదా మీ అనుమానం. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలింను కేవలం ముగ్గురు వ్యక్తులు కలిసి, ఇంట్లోనే తీశారు. అది కూడా జస్ట్ 24 గంటల్లో పూర్తిచేశారు. అందులో కీలక పాత్ర పాయల్ పోషించింది. 16 నిమిషాల షార్ట్ ఫిలింలో దాదాపు 14 నిమిషాలు ఆమె మాత్రమే కనిపిస్తుంది. అంటే కథ మొత్తం పాయల్ చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఈ షార్ట్ ఫిలింకు ఏ రైటర్ అనే పేరుపెట్టారు.

షార్ట్ ఫిలిం అయితే పెట్టారు కానీ దానికి పెద్దగా ప్యూస్ మాత్రం రావడం లేదు. జనాలంతా వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్, ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై ఫోకస్ పెట్టిన ఈ రోజుల్లో.. పాయల్ నటించిన షార్ట్ ఫిలిం క్లిక్ అవ్వడం కాస్త కష్టమే. పైగా కాన్సెప్ట్ కూడా మరీ అంత కొత్తది కాదు. రాబోయే రోజుల్లోనైనా ఈ షార్ట్ ఫిలిం ఊపందుకుంటుందేమో చూడాలి.

Watch it now ! A Writer 📖 https://youtu.be/eRqEkH_oZyg

Publiée par Payal Rajput sur Samedi 16 mai 2020