Telugu Global
NEWS

మాట నిలబెట్టుకున్న మంత్రి పేర్ని నాని

ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట నిలబెట్టుకున్నారు. ఓ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకున్నారు. ప్రమాదంలో జర్నలిస్టు మరణించడంతో ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అన్నట్లుగానే ఆకుటుంబానికి సాయం చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో రోడ్డు ప్రమాదంలో రాజోలు టీవీ 9 కెమెరామెన్ రుద్ర భాను వీర మురళీ ప్రసాద్ మరణించారు. విజయవాడలో అర్ధరాత్రి విధులు ముగించుకుని వెళుతున్న మురళీ…. లారీ ఢీకొని చనిపోయారు. దీంతో అప్పుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పేర్ని […]

మాట నిలబెట్టుకున్న మంత్రి పేర్ని నాని
X

ఏపీ సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట నిలబెట్టుకున్నారు. ఓ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకున్నారు. ప్రమాదంలో జర్నలిస్టు మరణించడంతో ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అన్నట్లుగానే ఆకుటుంబానికి సాయం చేశారు.

గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో రోడ్డు ప్రమాదంలో రాజోలు టీవీ 9 కెమెరామెన్ రుద్ర భాను వీర మురళీ ప్రసాద్ మరణించారు. విజయవాడలో అర్ధరాత్రి విధులు ముగించుకుని వెళుతున్న మురళీ…. లారీ ఢీకొని చనిపోయారు. దీంతో అప్పుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పేర్ని నాని… ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ప్రకటించారు.

మంత్రి హామీ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం రాజోలు మండలం తాటిపాకలో ఉంటున్న మురళీ కుటుంబాన్ని మంత్రి పేర్ని నాని, మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ పరామర్శించారు.

ఈ సందర్భంగా మురళీ కుటుంబ సభ్యులకు మంత్రి నాని 10 లక్షల రూపాయల చెక్కు ను అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాజమహేంద్రవరం టీవీ5 రిపోర్టర్ తాతాజీ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని.. వారి కుటుంబ సభ్యులకు కూడా ముఖ్య మంత్రి 10 లక్షల రూపాయలను మంజూరు చేశారని అన్నారు

First Published:  16 May 2020 8:15 PM GMT
Next Story