Telugu Global
NEWS

జగన్‌ తర్వాత నెంబర్‌ 2 కేడరే... టీడీపీ ప్రచారం అవాస్తవం

జగన్‌మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ ఉందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అలాంటి అవకాశం కూడా లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా చూసే వ్యక్తి కానేకాదన్నారు. వైసీపీలో జగన్‌ మోహన్ రెడ్డి తర్వాత నెంబర్‌ టూ స్థానం కేడర్‌కే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రికి దగ్గర ఉండే అవకాశం కొందరికి ఉంటుందని దాన్ని మరోలా అనుకోవడానికి వీల్లేదన్నారు. కేవలం శక్తిసామర్థ్యాల ఆధారంగానే జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తుంటారని […]

జగన్‌ తర్వాత నెంబర్‌ 2 కేడరే... టీడీపీ ప్రచారం అవాస్తవం
X

జగన్‌మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ ఉందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అలాంటి అవకాశం కూడా లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా చూసే వ్యక్తి కానేకాదన్నారు. వైసీపీలో జగన్‌ మోహన్ రెడ్డి తర్వాత నెంబర్‌ టూ స్థానం కేడర్‌కే ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రికి దగ్గర ఉండే అవకాశం కొందరికి ఉంటుందని దాన్ని మరోలా అనుకోవడానికి వీల్లేదన్నారు. కేవలం శక్తిసామర్థ్యాల ఆధారంగానే జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తుంటారని గౌతమ్ రెడ్డి వివరించారు. మీడియా ముందు కనిపిస్తే యాక్టివ్‌గా ఉన్నట్టు, గుర్తింపు ఉన్నట్టు… మీడియాలో కనిపించకపోతే యాక్టివ్‌గా లేరు అన్న భావన సరికాదన్నారు.

15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడిగా జగన్‌మోహన్ రెడ్డి వద్ద చాలా ఫ్రీగా ఉండేవాడినని… ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లు పడ్డ కష్టాలు, ఆయన నిలబడిన తీరు, ఎదిగిన విధానం చూసిన తర్వాత ఆయన ముందు చాలా చిన్న వాడిగా తాను భావిస్తానని గౌతమ్ రెడ్డి చెప్పారు.

తొమ్మిదేళ్ల పాటు కష్టాలకు తట్టుకుని నిలబడడం అసాధారణ విషయమని అందుకు జగన్‌మోహన్ రెడ్డికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందేనన్నారు. మే 28న విశాఖ పరిపాలన రాజధాని ప్రారంభం అవుతుందన్న ప్రచారం గురించి తనకు తెలియదని… ఇప్పటి వరకు ఎలాంటి తేదీలను తమకు చెప్పలేదన్నారు. అయితే విశాఖకు పరిపాలన రాజధాని వెళ్లడం మాత్రం ఖాయమని గౌతమ్ రెడ్డి చెప్పారు. వికేంద్రీకరణ వల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు.

First Published:  17 May 2020 8:50 PM GMT
Next Story