Telugu Global
Cinema & Entertainment

చేతులు దులుపుకుంటున్న నిర్మాతలు

వరుసగా నాలుగో సారి లాక్ డౌన్ పడింది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఆ తర్వాతైనా టాలీవుడ్ లో పనులు మొదలవుతాయనే గ్యారెంటీ లేదు. ఒకవేళ చిన్నాచితకా పనులకు అనుమతులు ఇచ్చినా థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరుచుకోవు. దీంతో నిర్మాతలంతా తమ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని ఎలాగోలా వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రెడ్, నిశ్శబ్దం, ఉప్పెన లాంటి పెద్ద సినిమాల్ని పక్కనపెడితే.. మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇప్పుడు ఓటీటీ […]

చేతులు దులుపుకుంటున్న నిర్మాతలు
X

వరుసగా నాలుగో సారి లాక్ డౌన్ పడింది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఆ తర్వాతైనా టాలీవుడ్ లో పనులు మొదలవుతాయనే గ్యారెంటీ లేదు. ఒకవేళ చిన్నాచితకా పనులకు అనుమతులు ఇచ్చినా థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరుచుకోవు. దీంతో నిర్మాతలంతా తమ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని ఎలాగోలా వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

రెడ్, నిశ్శబ్దం, ఉప్పెన లాంటి పెద్ద సినిమాల్ని పక్కనపెడితే.. మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇప్పుడు ఓటీటీ వైపు ఆశగా చూస్తున్నాయి. వీలైనంత త్వరగా వాటిని వదిలించుకొని ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు నిర్మాతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ వేదికల వైపు చిన్న నిర్మాతల అడుగులు చకచకా పడుతున్నాయి.

కీర్తిసురేష్ నటించిన పెంగ్విన్ సినిమాను ఇప్పటికే అమెజాన్ దక్కించుకుంది. అటు అమృతారామమ్ అనే సినిమా అల్రెడీ జీ5లో వచ్చేసింది. త్వరలోనే సత్యదేవ్, నవీన్ చంద్ర నటించిన సినిమాలు కూడా నెట్ లో ప్రత్యక్షం కాబోతున్నాయి. వీటికి తోడు రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను కూడా రిలీజ్ కు ముందే ఓటీటీలో ఇచ్చేయాలని చూస్తున్నాడు నిర్మాత.

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపు మీడియం రేంజ్ నిర్మాతలంతా తమ చేతిలో ఉన్న సినిమాల్ని వదిలించుకొని అయినకాడికి డబ్బులు చేసుకోవాలని చూస్తున్నారు. ఎఁదుకంటే.. జూలై వరకు థియేటర్లు తెరుచుకునేలా కనిపించడం లేదు. ఆ తర్వాత కూడా ఇలాంటి చిన్న సినిమాలకు రిలీజ్ డేట్స్ దొరకవు. అప్పటికి దసరా, దీపావళి ముంచుకొస్తాయి. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలు రెడీ అయిపోతాయి. అందుకే చిన్న సినిమాలన్నీ ఇలా ఓటీటీ వైపు ఆబగా చూస్తున్నాయి.

First Published:  18 May 2020 8:28 AM GMT
Next Story