నటన నుంచి తప్పుకున్న చార్మి

నిజానికి నాలుగేళ్ల నుంచే నటించడం మానేసింది చార్మి. కాకపోతే జనాల్లో మాత్రం ఏదో మూల చిన్న ఆశ. అవకాశాల్లేక చార్మి నటించడం లేదని, రేపోమాపో క్యారెక్టర్ ఆర్టిస్టు అవతారం ఎత్తుతుందని, అవసరమైతే ఐటెంసాంగ్స్ చేస్తుందని అనుకున్నారంతా. అయితే చార్మి మాత్రం అలాంటివేం ఉండవని స్పష్టంచేసింది. తను యాక్టింగ్ కు పూర్తిగా దూరమౌతున్నట్టు ప్రకటించింది చార్మి.

నిజానికి జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఆమె రిటైర్ అవుతామని అనుకుందట. అదే విషయాన్ని పూరి జగన్నాధ్, సి.కల్యాణ్ కు చెప్పిందట. రిటైర్ అవ్వాలనుకుంటే చెప్పడం ఎందుకు, నటన మానేయమని వాళ్లు సూచించడంతో ఎలాంటి ప్రకటన చేయకుండా తప్పుకున్నట్టు తెలిపింది చార్మి.

అలా నాలుగేళ్లుగా కెమెరాకు దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు తను పూర్తిగా నటనకు స్వస్తి పలికినట్టు ప్రకటించింది. ఆమె ఇప్పుడిలా ఉన్నఫలంగా ఈ ప్రకటన చేయడం వెనక ఓ రీజన్ ఉంది. ఆమె చాలా రోజుల కిందటే నిర్మాతగా మారింది. అయితే ఆమె నిర్మాణంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సక్సెస్ తో ఇక నిర్మాతగా కొనసాగాలని చార్మి నిర్ణయించుకుంది. అందుకే ఇప్పుడు ఇలా ప్రకటన చేసింది.