మెగా హీరోలపై లావణ్య త్రిపాఠి కామెంట్స్

ఒకేసారి టాలీవుడ్ హీరోలందరిపై రియాక్ట్ అయింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన దృష్టిలో ఏ హీరో ఎలాంటోడు అనే అంశంపై స్పందించింది. ప్రతి హీరోకు ఓ స్పెషాలిటీ ఉంటుందని చెబుతూనే.. ఆ హీరోలో ఉన్న ప్రత్యేకత ఏంటి.. అతడిలో తనకు నచ్చిన అంశాలేంటి అనే విషయంపై సూటిగా స్పందించింది.

తన దృష్టిలో చిరంజీవిని లెజెండ్ అంటోంది లావణ్య త్రిపాఠి. అంత సీనియర్ హీరో అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా ఉండడం తనకు చాలా బాగా నచ్చిందని చెబుతోంది.

ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పై స్పందిస్తూ.. రామ్ చరణ్ లో ఫైర్ అంటే తనకు ఇష్టం అంటోంది. మరీ ముఖ్యంగా రంగస్థలంలో రామ్ చరణ్ అంటే తనకు పిచ్చి అంటోంది.

ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ పై కూడా లావణ్య రియాక్ట్ అయింది. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురు నిలబడే అతని ధైర్యం అంటే తనకు ఇష్టమని, పవన్ నిజమైన హీరో అని అంటోంది.

ఇక అల్లు అర్జున్, వరుణ్ తేజ్ పై కూడా రియాక్ట్ అయింది. వరుణ్ తేజ్ ను హార్డ్ వర్కర్ గా చెప్పుకొచ్చిన లావణ్య.. అర్జున్ నుంచి మరో బ్లాక్ బస్టర్ కోసం వెయిటింగ్ అని తెలిపింది.