లాయర్ అవుదామనుకున్న ముద్దుగుమ్మ… కానీ

నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోయిన్లంతా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైపోయారు. ఖాళీగా ఉండడంతో అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లోకి వస్తున్నారు. ఎన్నో వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా తన కెరీర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ను పంచుకుంది.

నిజానికి ప్రగ్యా జైస్వాల్ కు హీరోయిన్ అవ్వాలనే ఆలోచన లేదట. బాగా చదువుకొని లాయర్ అవుదామని అనుకుందట. అయితే కాలేజ్ లో ఒక సందర్భంలో మోడలింగ్ చేయాల్సి వచ్చింది. అలా చేసిన మోడలింగ్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా మోడలింగ్ అవకాశాలు రావడంతో అలా నటన వైపు దృష్టి పెట్టినట్టు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. తను హీరోయిన్ గా మారకపోయి ఉంటే ఈ పాటికి లాయర్ అయ్యేదాన్నని చెబుతోంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో బనానా చాక్లెట్ కేక్ తయారుచేయడం నేర్చుకుందట ప్రగ్యాజైశ్వాల్. అంతేకాదు.. రకరకాల పుస్తకాలు కూడా చదవడంతో పాటు.. గ్లామర్ దెబ్బతినకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. తన బ్యూటీ సీక్రెట్స్, బ్యూటీ టిప్స్ అన్నింటినీ నెటిజన్లతో పంచుకుంది.