ఆగస్ట్ 15న ఉప్పెన రిలీజ్?

మరో 2-3 నెలల వరకు థియేటర్లు తెరుచుకోవనే విషయంపై అందరికీ స్పష్టత వచ్చేసింది. లాక్ డౌన్-4 అమల్లోకి వచ్చేయడంతో పాటు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమలపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో.. మేకర్స్ అంతా తమ సినిమాల్ని ఆగస్ట్ నుంచి షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఒకవేళ థియేటర్లు తెరిస్తే జులైలో చిన్న సినిమాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ క్రమంలో ఉప్పెన సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ రెడీ అయింది. సెన్సార్ ఒక్కటే బ్యాలెన్స్. కాబట్టి ఆగస్ట్ 15 కోసం థియేటర్లను లాక్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. జూన్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరోవైపు ఉప్పెన సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారనే ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ఈ సినిమాను ఎంత ఆలస్యమైనా సిల్వర్ స్క్రీన్ పైకి మాత్రమే తీసుకొస్తామని ప్రకటించింది. వైష్ణవ్ తేజ్ కు ఇది మొదటి సినిమా అవ్వడంతో, ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.