అహనా పెళ్లంట… హీరోయిన్ రియాక్షన్

“అదేంటి.. నా పెళ్లి గురించి నాకే చివరిగా తెలిసింది (నవ్వులు). ఎప్పట్లానే అన్నీ నాన్సెన్స్ రూమర్స్. అందరికీ ఎందుకు నా పెళ్లి గురించి అంత ఆత్రుత. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఇంటి పైకప్పు ఎక్కి మరీ ఆ విషయాన్ని రాయమని మీడియాకు గట్టిగా చెబుతాను. నేను పెళ్లి చేసుకోవడం లేదు. సినిమాలు ఆపడం లేదు.”

వరలక్ష్మి శరత్ కుమార్ రియాక్షన్ ఇది. ఏ విషయంపైనైనా బోల్డ్ గా మాట్లాడే ఈ హీరోయిన్.. తన పెళ్లిపై కూడా అంతే సూటిగా, స్పష్టంగా రియాక్ట్ అయింది. ప్రతిసారి ఇలా తన పెళ్లిపై పదేపదే పుకార్లు రాస్తుంటే మీడియాకు బోర్ కొట్టదా అనే సందేహాన్ని వ్యక్తంచేసింది వరలక్ష్మి. తాజాగా తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఇలా ఖండించింది.

గతంలో హీరో విశాల్ తో డేటింగ్ చేసింది వరలక్ష్మి. ఆ విషయాన్ని ఆమె దాచే ప్రయత్నం చేయలేదు. డేటింగ్ చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. అప్పట్నుంచి తను సింగిల్ గానే ఉంటున్నానని, ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని అంటోంది వరలక్ష్మి. ఇప్పుడిప్పుడే తెలుగులో సినిమాలకు కమిట్ అవుతోంది వరలక్ష్మి.