Telugu Global
NEWS

రేపటి నుంచి ఏపీ బస్సులు... ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు

ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించింది. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు మాత్రమే బస్సులు నడపనుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఆర్డినరీ బస్సుల్లో కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. ముందుగా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే బస్సులు నడుపుతారు. ఆ తర్వాత గ్రామాలకు సైతం తిప్పనున్నారు. స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్న వారికే ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్ […]

రేపటి నుంచి ఏపీ బస్సులు... ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు
X

ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ ప్రారంభించింది. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు మాత్రమే బస్సులు నడపనుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఆర్డినరీ బస్సుల్లో కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. ముందుగా పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే బస్సులు నడుపుతారు. ఆ తర్వాత గ్రామాలకు సైతం తిప్పనున్నారు.

స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్న వారికే ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్ని బస్సుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలోనే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడే టికెట్లు తీసుకోవాలి.

ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా వందశాతం ఉద్యోగులు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం సహా అన్ని కార్యాలయాల్లో వంద శాతం హాజరుతో కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ లతో పాటు అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు విధులుకు హాజరుకావాలని తెలిపింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని.. సిబ్బంది విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆటోలు, ప్రైవేటు ట్రాన్స్‌ పోర్టు వెహికల్స్‌ కూడా నడవనున్నాయి.

జూన్‌ 1 నుంచి 200 నాన్‌ ఏసీ ట్రైన్లు నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఈ రైళ్లు నడవనున్నాయ. వీటి టైమ్‌ టేబుల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుంని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

First Published:  19 May 2020 8:06 PM GMT
Next Story