Telugu Global
NEWS

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి యాక్టివ్ రోల్ ?

ఒకప్పుడు వైఎస్‌ హయాంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు చేపడితే జై కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నారు. కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవగా… తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆచితూచి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న నేపథ్యంలో… కేసీఆర్‌ కఠినంగా కాకుండా పోతిరెడ్డిపాడుపై కాస్త సానుకూలంగా మాట్లాడారు. కేసీఆర్‌ ఇలా […]

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి యాక్టివ్ రోల్ ?
X

ఒకప్పుడు వైఎస్‌ హయాంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు చేపడితే జై కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నారు.

కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవగా… తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆచితూచి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న నేపథ్యంలో… కేసీఆర్‌ కఠినంగా కాకుండా పోతిరెడ్డిపాడుపై కాస్త సానుకూలంగా మాట్లాడారు.

కేసీఆర్‌ ఇలా మాట్లాడడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. రాయలసీమకు నీరు అందించే ఉద్దేశంతో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిందే అని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇవ్వనున్నట్టు ఉత్తమ్‌ వెల్లడించారు.

తెలంగాణను పద్ధతి ప్రకారం ఎండబెట్టే కుట్ర చేస్తున్న కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను బొంద పెట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో 70% పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్‌ అన్నారు. ఎస్సెల్బీసీ, డిండి, ఉద యసముద్రం ప్రాజెక్టుల చిన్న చిన్న పనులు పూర్తికానప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పూర్తయిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

మరోవైపు చంద్రబాబునాయుడు శిష్యుడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై భగ్గుమంటున్నారు. ఆయన సొంతంగానే ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబునాయుడు పోతిరెడ్డిపాడు పెంపు విషయంలో మౌనంగా ఉండగా… రేవంత్ రెడ్డి అటు నుంచి యాక్టివ్ అవుతున్నారు.

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ ఏనాడూ పోరాటం చేయలేదని… ఇప్పుడు మాత్రం తానే గతంలో పోతిరెడ్డిపాడుపై పోరాటం చేశానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాయలసీమకు నీరు అందించే ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుని తీరుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ఉద్యమం చేస్తామని ప్రకటించారు.

First Published:  19 May 2020 8:53 PM GMT
Next Story