ఫైటర్ లో అదే హైలెట్ అంట!

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్. అన్ని సినిమాల్లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. పైగా ముంబయిలో షెడ్యూల్ కావడంతో, వారం రోజుల ముందే ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వచ్చేశారు. అలా ఆగిపోయిన ఈ సినిమా విశేషాల్ని చార్మి వివరిస్తోంది. ఫైటర్ సినిమా పాన్-ఇండియా సినిమా అంటోంది.

టైటిల్ కు తగ్గట్టు ఫైటర్ సినిమా యాక్షన్ మూవీనే అయినప్పటికీ.. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా ఎలివేట్ అవుతాయని అంటోంది చార్మి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ లోనే విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు తీశామని, ఆ సీన్స్ అద్భుతంగా వచ్చాయని చెబుతోంది.

ఈ సినిమాలో దేవరకొండ, రమ్యకృష్ణ తల్లికొడుకుగా నటిస్తున్నారు. సెంటిమెంట్ సీన్స్ ఎంత బాగా వచ్చాయో చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్ కూడా చెబుతోంది చార్మి. ఈ సినిమాకు మలేషియాకు చెందిన ఓ ఫైట్ మాస్టర్ పనిచేస్తున్నాడు. తెలుగు రాకపోయినా.. విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ నటించిన సెంటిమెంట్ సీన్ చూసి అతడు ఏడ్చేశాడట.

ఇలా ఫైటర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు హెవీ డోస్ సెంటిమెంట్ కూడా ఉంటుందని చెబుతోంది నిర్మాత చార్మి.