Telugu Global
NEWS

ఇంట్లో దీక్షలేంటి? టైం వేస్ట్‌... టీడీపీపై జేసీ

విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా రావడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఇళ్లలోనే కూర్చుని దీక్ష చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చుని దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి దీక్షలు వేస్ట్‌ అని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఇలాంటి దీక్షలు చేయాల్సి వస్తోందో టీడీపీ నేతలకే అర్థం కావడం లేదన్నారు. ఇంట్లో కూర్చుని దీక్షలు చేస్తే జగన్‌ స్పందిస్తారా అని ప్రశ్నించారు. అమరావతిలో 158 రోజులుగా దీక్ష […]

ఇంట్లో దీక్షలేంటి? టైం వేస్ట్‌... టీడీపీపై జేసీ
X

విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా రావడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఇళ్లలోనే కూర్చుని దీక్ష చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చుని దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి దీక్షలు వేస్ట్‌ అని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఇలాంటి దీక్షలు చేయాల్సి వస్తోందో టీడీపీ నేతలకే అర్థం కావడం లేదన్నారు.

ఇంట్లో కూర్చుని దీక్షలు చేస్తే జగన్‌ స్పందిస్తారా అని ప్రశ్నించారు. అమరావతిలో 158 రోజులుగా దీక్ష చేస్తుంటేనే ఎవరూ స్పందించడం లేదని… ఇప్పుడు ఇంట్లో కూర్చుని కొద్దిసేపు దీక్షలు చేస్తే స్పందన ఏముంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విలువలు పూర్తిగా మాయమైపోయాయని జేసీ ఆవేదన చెందారు. రాజ్యం ప్రస్తుతం వైసీపీ వాళ్లదే కాబట్టి టీడీపీ వారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఏం చూస్తామని వ్యాఖ్యానించారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో జగన్‌ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని… అందుకు అందరూ అభినందించాల్సిందేనన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం తొలుత పెంచింది వైఎస్సేనని… అందుకోసం ఆయన చాలా కృషి చేశారని జేసీ వ్యాఖ్యానించారు.

First Published:  21 May 2020 6:12 AM GMT
Next Story