ఆరోజు ఏకంగా ఓపెనింగ్ అంట !

మరో 10 రోజుల్లో మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్ రాబోతోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మహేష్-పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా షురూ అయింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆరోజు కేవలం ఎనౌన్స్ మెంట్ మాత్రమే కాదు, ఏకంగా సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేయాలని చూస్తున్నారట.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో 31న సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఓ కారణం కూడా ఉంది. 31తో నాలుగోదశ లాక్ డౌన్ ముగుస్తుంది. మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆల్రెడీ చాలా మినహాయింపులు ఇచ్చేశారు. జనజీవనం దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది.

కాబట్టి.. 31న సినిమా ఓపెనింగ్ కానిచ్చేస్తే.. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఏ క్షణానైనా సెట్స్ పైకి వెళ్లిపోవచ్చనేది ఆలోచనగా ఉంది. అదే కనుక నిజమైతే మహేష్ అభిమానుల పండగ రెట్టింపు అయినట్టే.