హృతిక్ తో సెల్ఫ్ క్వారంటైన్ – పూజా హెగ్డే

హృతిక్ అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి బయటపెట్టింది హీరోయిన్ పూజా హెగ్డే. అతడితో కలిసి చేసిన సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. హృతిక్ అంటే పిచ్చి మాత్రం తగ్గలేదని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైమ్ లో హృతిక్ తో ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ గడపడానికి ఇష్టపడతానని బోల్డ్ గా చెబుతోంది.

“ఈ సెల్ఫ్ క్వారంటైన్ టైమ్ లో చాలామంది హీరోలతో గడపాలని ఉంది. మహేష్, బన్నీ, ప్రభాస్, రామ్ చరణ్ వీళ్లందరితో గడపాలని ఉంది. ఒక్కరి పేరు చెప్పమంటే మాత్రం హృతిక్ పేరు చెబుతా. అతడితో అలా స్వీయ నిర్బంధంలో ఉండిపోవాలని ఉంది. చిన్నప్పట్నుంచి హృతిక్ అంటే పిచ్చి. ఆ వ్యామోహం అలా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.”

మరోసారి హృతిక్ సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది పూజా హెగ్డే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. కాల్షీట్లు అన్నీ వేస్ట్ అవ్వడం వల్ల సినిమాల అప్ డేట్స్ చెప్పలేకపోతున్నానని.. ఒక్కసారి కాల్షీట్లు అన్నీ సెట్ అయి, అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత కొత్త సినిమా విశేషాలు వెల్లడిస్తానని అంటోంది. చాలా క్రేజీ సినిమాలు మాత్రం చేతిలో ఉన్నాయని చెబుతోంది.