లాక్ డౌన్ లో రానా నిశ్చితార్థం

ఎలాంటి సందడి లేకుండా, మీడియాకు లీకులు లేకుండా ఎంగేజ్ మెంట్ కానిచ్చేశాడు రానా. నిన్న సురేష్ బాబు ఇంట్లో ఈ నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. లాక్ డౌన్ నిబంధనల వల్ల ఎక్కువమంది అతిథులు లేకుండా, అటుఇటుగా ఓ 20 మందితో ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది.

నిజానికి రానా ఇంత సడెన్ గా నిశ్చితార్థం చేసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. మిహికా బజాజ్ తల్లిదండ్రులు, బంధువులు సురేష్ బాబు ఇంటికి వస్తున్నారని… చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారని, పెళ్లికి సంబంధించి చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇలా ఏకంగా నిశ్చితార్థం కానిచ్చేస్తారని మీడియా ఊహించలేకపోయింది.

తనకు, మిహికా బజాజ్ కు నిశ్చితార్థం పూర్తయిన విషయాన్ని రానా స్వయంగా బయటపెట్టాడు. దీనికి సంబంధించి అతడు కొన్ని ఫొటోలు కూడా రిలీజ్ చేశాడు. చూస్తుంటే.. పెళ్లి కూడా తొందరగానే అయిపోయేలా ఉంది. డిసెంబర్ లో పెళ్లి ఉండొచ్చని సురేష్ బాబు అన్నారు. కానీ అంతకంటే ముందే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.